Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ వర్సెస్..ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు
- సమస్యలపై అధికారులను నిలదీసిన ప్రజలు
నవతెలంగాణ-ఆత్మకూర్
గ్రామపంచాయతీలో నిధులు ఉన్న కూడా అభివృద్ధి చేయకుండా పట్టణానికే పరిమితం అయ్యారని ఉప సర్పంచ్ వీసం శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్లు విచారణ అధికారికి మొరపెట్టుకోవడంతో సర్పంచ్ దంపతులు భీరం శ్రీలత-రామకృష్ణ రెడ్డి మేము పనులు చేసిన బిల్లు లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని పరస్పరం దూషిం చుకున్నారు. శుక్రవారం గూడెప్పాడ్ గ్రామపంచాయతీలో విషయంపై జిల్లా పంచాయితీ అధికారికి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామానికి సర్పంచ్ రావడం లేదని ఫిర్యా దు చేసిన విషయం తెలిసిందే. జిల్లా అధికారి ఆదేశాల సారం ఎంపీఓ చేతన్ కుమార్రెడ్డి విచారణ చేపట్టారు. వార్డ్ మెంబర్లు, ఉపసర్పంచ్ వీసం శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటే సర్పంచ్ పట్టించుకోకపోవడం వల్లేనే గ్రామంలో సమస్యలు తాండ విస్తున్నాయని ఎంపీఓ కు వివరించారు. సర్పంచ్ దంప తులు జోక్యం చేసుకొని మేము చేసిన పనులకు మూడు సంవత్సరాలైనా బిల్లులు తీసుకోలేదని ఎంప వోకు చేసిన పనుల జాబితాను చూపించారు. ఒకేసారి ఇరువర్గాలు పరస్పరం దూషించుకోవడంతో గ్రామపంచాయితీ దద్దరి ల్లింది. ఎంపీఓ జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతి పచేసి మీ సమస్యలను అన్నింటిని ఒక పేపర్ మీద రాసి తీసుకొని వచ్చి ఇస్తే జిల్లా పంచాయితీ అధికారికి అంద చేస్తానని ఎవరినెవరూ దూషించుకోవద్దని అన్నారు.
సమస్యలపై అధికారులను నిలదీసిన ప్రజలు
గ్రామస్తులు గ్రామపంచాయతీలోకి దూసుకొని వచ్చి రెండు సంవత్సరాల నుండి మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఎందుకు మేము పన్నులు చెల్లించాలని వాదనకు దిగారు. మీకు నీరు వస్తేనే నల్లా పన్ను చెల్లించాలని అప్పటివరకు ఎవరిని అడగవద్దని పంచాయతీ కార్యద ర్శికి, సిబ్బందికి ఆదేశించారు. 60 సంవత్సరాలు దాటినా మాకు ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదని గ్రామా పంచా యతీలో గందరగోళం సృష్టించారు. ఏమిచెప్పే సమాధానం లేక అధికారులు తలలు పట్టుకున్నారు. గ్రామానికి సమీపంలో కోళ్ల ఫారాలకు ఎలా పర్మిషన్లు ఇస్తారని ఆ దుర్వాసనతో అనారోగ్యాల బారిన పడు తు న్నారని గ్రామస్తులు అధికారులపై మండి పడ్డారు. వెం టనే కోళ్ల ఫారాలు తొలగించాలని అధికారులను డిమాం డ్ చేశారు. జిల్లా అధికారికి ఇరువర్గాలు రాసి ఇచ్చిన పత్రలను అందచేస్తామని ఎంపీవో చెప్పారు.