Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే టి.రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత నిరుపేదలైన వ్యవసాయ కూలీల సమస్యలసాధనకు నిరంతరం కషి చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలు ఈనెల 28, 29 తేదీలలో డివిజన్ కేంద్రంలో జరగనున్నాయని, జయప్రదం చేయాలని మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన సంఘ కరపత్రాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. 1932లో పుచ్చలపల్లి సుం దరయ్య స్థాపించిన వ్యవసాయ కార్మిక సంఘం దశాబ్దాల తరబడి చేసిన పోరాటాల ఫలితంగా భూ సంస్కరణల చట్టం, అంటరానితనం నిర్మూలన చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, గిరిజనులకు పోడు భూముల హక్కు పత్రాల చట్టం వంటివి అనేకం సాధించిందని అన్నారు. పేదలకు సంబంధించిన అనేక మౌలిక సమస్యల్ని ప్రభుత్వాల దష్టికి వివిధ రూపాల్లో తీసుకురావడంతో అనేక సంక్షేమ పథకాలు నేడు ప్రజలకు అందుతున్నాయని వివరించారు. పేదలకు విద్య, వైద్యం వంటివి ఇంకా సాధించాల్సి ఉన్నదని, పేదలు ఐక్యంగా ఉంటేనే సాధ్యపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలను సంఘటిత పరిచేందుకు తలపెట్టిన మహాసభలకు అన్ని రంగాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం ముఖ్య భాగస్వామ్యులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, రైతు సమన్వయ కమిటీ జిల్లా నాయకులు అక్కనపల్లి బాలరాజు, కూడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం, ఆహ్వాన సంఘం కోశాధికారి, వెంకటాద్రిపేట ఎంపీటీసీ ఎన్నకూస కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిగురు సరిత, తదితరులు పాల్గొన్నారు.