Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
- సమస్యల పరిష్కారానికి ప్రజలతో ప్రముఖాముఖి
నవతెలంగాణ-కాజీపేట
వరంగల్ నగరానికి ముఖ ద్వారమైమన కాజీపేట ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజలను నేరుగా కలిసి సమస్యలను తెలుసు కొని పరిష్కరించేందుకు కొన్నిరోజులుగా ముఖాముఖి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు, పలు విభాగాల అధికా రులతో కలిసి 47,48,61, 62,63 డివిజన్ల ప్రజలతో ముఖా ముఖిని నిర్వహించి 35 ఫిర్యాదులను స్వీకరించి ఆయా సమస్యల ను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ అభివృద్ధి నిరంతరం ప్రక్రియ పలు దశలుగా ప్రాంత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని మతాల ప్రజలు భాయ్ భాయ్ సిద్ధాంతంతో స్నేహ పూర్వకంగా మెలగడం కాజిపేట ప్రత్యేకత అన్నారు. గత కొన్ని రోజులుగా జాతీయ రహదారిపై కొంతమంది కూరగాయలు అమ్మడం వలన ట్రాఫిక్ సమస్య పెరుగుతూ ప్రమాదాలు జరుగు తుండంతో మార్కెట్ వ్యాపారులకు నష్టం జరుగుతుందని గతం లో ఫిర్యాదును ఇవ్వగా ముఖాముఖి కార్యక్రమంలో ఇరువ ర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అనంతరం విజరు నగర్ కాలనీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి రూ.10లక్షల నిధులతో శంకు స్థాపన చేశారు. అధికారులతో కలిసి ఎఆర్ నగర్ కాలనీ,విష్ణుపురి కాలనీ,సోమిడిలోని పలు కాలనీలను కలియ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, కార్పొరేటర్లు సంకు నర్సింగ్, ఎలకంటి రాములు, విజయ శ్రీ రాజలి, మాజీ కార్పొరేటర్ అబూ బకర్, రైతు సమన్వయ జిల్లా కోఆర్డినటర్ సుంచు కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు సుంచు అశోక్, డివిజన్ అధ్యక్షులు రంజిత్, కోటి లిం గం, పాలడుగుల శివ, అధికారులు పాల్గొన్నారు.