Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
కూలి, భూమి, ఉపాధి కోసం ఉధృత పోరాటాలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి నాగ య్య పిలుపునిచ్చారు. శుక్రవారం వ్యకాస జిల్లా రెండవ మహాస భలు జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బంచరాయి, సీలింగ్, దేవాదాయ భూములు వేలాది ఎకరాలు ఉన్నాయని అన్నారు. ఆ భూములను భూస్వాములు ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ఆ భూములను భూమిలేని దళిత, గిరిజన వెనుకబడిన తరగతుల వారికి, నిరుపేదల ఇండ్ల స్థలాలకు, సాగు భూములకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మి కుల జీవన పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. పెరి గిన ధరలతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రెక్కల కష్టం మీద ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు కూలిబంధు ప్రవేశపెట్టి మూడెకరాలకు రూ.30వేలు కూలీల అకౌంట్లో వేయాలన్నారు. కూలీలకు బీమా సౌకర్యం కల్పించాలని, రేషన్ ద్వారా 16రకాల నిత్యా వసర సరుకులు ఇవ్వాలని కోరారు. 2016 జీఓ సవరించి కొత్త జీఓ తీసుకొచ్చి కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా మండ రాజన్న, కుర్ర మహేష్, చంద్రకళ వ్యవహరించారు.
జిల్లా మా సభల్లో నూతన కమిటీని 32మందితో ఎన్నుకు న్నారు. అధ్యక్షులుగా మండ రాజన్న, ప్రధా న కార్యదర్శిగా అలవాల వీరయ్య, సహయ కార్యదర్శిగా కుర్ర మహేష్, ఉపాధ్యక్షులుగా బాణాల రాజన్న, ఎండి యాకూబ్, చేపూరి గణేష్, సహకార దర్శులుగా వంగూరు వెంకటేశ్వర్లు, ఉప్పనపల్లి శ్రీనివాస్, పెరమండ్ల తిలక్ బాబు, చంద్రకళతోపాటు మరో 22మందితో నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ మహా సభలో జిల్లా నాయకులు షేక్ మైసూర్, గొల్లపల్లి కష్ణ, కడియం సత్యం, గుండగాని మధుసూదన్, జక్కుల లింగన్న, చింతల బిక్ష పతి, ఏలూరు వీరభద్రం, గుడిశాల వెంకన్న, లింకు బ్రహ్మచారి, యాదగిరి, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.