Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
నకిలీ ధృవ పత్రాలతో పాటు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సహకారంతో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సం క్షేమ మండలి పథకాల సోమ్ము కాజేసిన ముఠాలోని ఇద్దరు నిందితులను టాస్క్‌ఫోర్స్, నర్సంపేట, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా కలిసి శుక్రవారం అరెస్ట్ చేయగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌తో సహా మరో ఐదుగురు పరారీలో వున్నారు. నిందితుల నుండి క్లయిం దరఖాస్తులు, సిపియూ, మాని టర్, సెల్‌ఫోన్, రూ.5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ జిల్లా నెక్కొం డకు చెందిన రాపాక వీరభద్రస్వామి, మరో నిందితుడు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన పర్ష రవిగా గుర్తింఆచరు.మరో ఐదుగురు నర్సంపేట, నెక్కొండ మండలాలకు చెందిన మహమ్మద్ అలీ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, లావుడ్యా నరసింహ, చందు, లావుడ్యా పు ల్యా, చిందం అశోక్ వున్నారు. అరెస్ట్‌కు సంబంధించి వరం గల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికుల కోసం పది సందర్భాల్లో వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఈ పథకాలను తమ ఆదాయ మార్గాలు ఎంచుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఇందులో భాగం నర్సం పేట కార్మిక శాఖ, కార్మికులకు మధ్య ఏజెంటుగా పనిచేస్తున్న రాపాక వీరభద్రస్వామి కార్మికులు అందించే పథకాల ద్వారా వచ్చే సొమ్ము మిగితా నిందితులతో కలిసి కాజేసేందుకు ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు వీరభద్రస్వామి మిగతా ఏజెంట్ల ద్వారా నిందితుడు ఆయా గ్రామాల్లో కార్మికులు ఆకస్మికంగా గానీ ప్రమాదవశాత్తు మరణించిన, కార్మికుల ఇంటిలో వివాహం, ప్రసవంలాంటి కార్యక్రమాలకు సంబంధించిన సమా చారాన్ని ప్రధాన నిందితుడు వీరభద్రయ్య సేకరిం చాడు. ఏజెంట్ల ద్వారానే కార్మికుల కుంటుంబాలకు కార్మిక శాఖ నుండి అందజేసే సంక్షేమాల పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తామని వచ్చిన డబ్బులో కొద్ది శాతం డబ్బు తీసుకుం టామని నమ్మించి వారి నుండి కార్మికునికి సంబంధించిన ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలతో తీసుకోవడంతో పాటు రూ. 1000 నుండి రూ. 5 వేల వరకు బాధితుల నుండి వసూలు చేసేవారు. నిందితుల్లో ఒకడైన వర్ష రవి నర్సంపేట పట్టణంలో డిటిపి సెంటర్ నిర్వహిస్తుండేవాడు. ఇతని సహకారంతో వీరభద్రస్వామి పథకాలకు అవసరమైన మరణ, వివాహ, బ్యాంక్ చలాన్లు, హాస్పటల్ డిస్చార్జ్ కార్డులను నకిలీ ధవీకరణ పత్రాలను సష్టించి వీటి ద్వారా కార్మికుని పేరు మీద కార్మిక సంక్షేమ పథకాలకు దరఖాస్తు ఫారాలను సర్సంపేట అసెస్టెంట్ లేబర్ అధికారికి అందజ ేసేవాడు. వీరభద్రయ్య, లేబర్ ఆఫీసర్ మధ్య సన్నిహిత సంబంధాల కారణంతో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండా దరఖాస్తులకు అమోదం తెలుపుతూ ఉన్నతాధికారుల దరఖాస్తులను పంపించేవాడు. ఈ ముఠా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది కార్మికలకు సంబంధించి వివిధ కార్మిక పథకాల వచ్చిన రూ.18లక్షల 70వేల ముఠా స్వాహా చేసింది. గోల్మాల్ సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి నర్సంపేట, నెక్కొండ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసిపి జితేందర్ రెడ్డి, సీఐలు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు ఫర్వీన్, శ్రీలక్ష్మీ, టాస్క్‌ఫోర్స్ ఎస్సై లవణ్ కుమార్, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్, అశోక్, కానిస్టేబుళ్లు నాగరాజు, సజన్, సురేష్, నవీస్, శ్యాం, శ్రీనులను సీపీ అభినందించారు.