Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విపిన్
నవతెలంగాణ-ములుగు
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారి డాక్టర్ విపిన్ తెలిపారు. ములుగు మండలంలోని రాయినిగూడెం పీహెచ్‌సీని డాక్టర్ విపిన్ శుక్రవారం సందర్శించారు. ఇందులో భాగంగా ఆసు పత్రిలో అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమయ పాలనపాటించాలని హాజరునమోదు ములుగు వెలుగు ఆప్ నందు రిజిస్టర్ చేయాలని ఇది తప్పనిసరి అని లేనిచో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 7 న ప్రా రంభమవుతున్న టిడి వ్యాక్సినేషన్ స్కూల్ బేస్డ్ క్యాంపెయిన్ యొక్క యాక్షన్ ప్లాన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10 -16 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు టిడి వ్యాక్సిన్ విధిగా వేయించాలని ఆదేశించారు. టిడివ్యాక్సిన్ సరిపోవు నిల్వ ల ను మైయింటైన్ చేయాలని ఫార్మసిస్ట్ శారదకు ఆదేశిం చా రు. కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ 100 శాతం పూర్తి చే యాలని మెడికల్ అధికారికి తెలిపారు. తదుపరి అవుట్ పేషెంట్ రిజిస్టర్ తనిఖీ చేశారు. రోగులకు ఉత్తమ సేవలు అందించాలని డాక్టర్ అమూల్యకు తెలిపారు. తర్వాత ఫార్మ సీ స్టోర్‌ను సందర్శించి అత్యవసర మందులు నిల్వలు ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అత్యవస ర మందులకై సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ కి ఎప్పటికప్పుడు ఇండెం ట్ పెడుతూ సరిపడా మందులు తెచ్చుకోవాలన్నారు. ప్రతి ఒక్క సబ్ సెంటర్ నుండి పదిమంది రోగులకు తగ్గకుండా వారికి టెలికన్సల్టెన్సీ ద్వారా వారికి అత్యవసర సేవలు చికిత్స లు అందించాలని తెలిపారు.
పీహెచ్‌సీకి వచ్చిన రోగులకు సంబంధించిన శాంపుల్స్ ను రక్త పరీక్షలు సంబంధించి తెలంగాణ డయాగస్టిక్ హబ్ కు ప్రతిరోజు పంపించాలని ల్యాబ్ టెక్నీషియన్ సుజాతకు తెలియజేశారు. అనంతరము రాయినిగూడెం గ్రామంలోని ఫ్రైడే డ్రైడే శుక్రవారం జరిగే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఆశాలు ప్రతిశుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడేను చేయా లని లార్వాలను వద్ధి చెందకుండా చూడాలని తద్వారా డెం గ్యూ మలేరియాలను అరికట్టవచ్చుని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డెమో తిరుపతయ్య, హెచ్ఈ భాస్క ర్, పిహెచ్సి సిబ్బంది డాక్టర్ అమూల్య, డాక్టర్ సిరాజ్, ఫార్మ సిస్ట్ శారద, ల్యాబ్ టెక్నీషియన్ సుజాత తదితర వైద్య సిబ్బం ది పాల్గొన్నారు.