Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యేనికుంట అడవిలో విద్యుత్ తీగలు స్వాధీనం
- కాగితాలకే పరిమితమవుతున్న వణ్యప్రాణి చట్టం
నవతెలంగాణ-తాడ్వాయి
అడవులలోస్వేచ్ఛగా సంచరించాల్సిన వన్యప్రా ణులు వేటగాళ్ల బారినపడి మాంసాహార ప్రి యులకు విందుభోజనంగా మారుతున్నాయి. ములుగు జిల్లా లోని తాడ్వాయిమండలంలోని దట్టమైన అటవీ ప్రాం తాలు ఉన్నాయి. అడవులకు సరిహద్దులోని గ్రామాల వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని ఆటోలు, ఇతర మార్గాల ద్వారా నగరాలు, పట్టణాలు, ఇతర గ్రామాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నా రు. వన్యప్రాణులకు ఉచ్చులు పెట్టడం, కరెంటు తీగ లు అమర్చడం, మందుగుండు సామాగ్రి ద్వారా వా టిహతమారుస్తున్నారు. కొన్ని గ్రామాలలో ముఠాలు గా ఏర్పడి పెద్దఎత్తున వన్యప్రాణులను వేటాడుతూ వాటి మాంసాన్ని ఇతర గ్రామాలకు తరలించి అధిక ధరలకువిక్రయిస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు. కుందేళ్లు, దుప్పులు, అడవి పందులు, కొండగొర్రెలు, జింకలు వేటగాళ్లవలలో పడి కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. ఈ చట్టాన్ని అమలు చేసి వన్య ప్రాణులను రక్షించాల్సిన అటవీ అధికారు లు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే వేట యథే చ్ఛగా కొనసాగుతోంది.
అటవీశాఖ సిబ్బందిలోని కొంతమంది వేటగాళ్ల తో చేతులు కలిపి వన్యప్రాణుల వేటకు సహకరిస్తు న్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి కొంత మంది తమ కనుసన్నల్లోనే ఈ వ్యాపారం జరుపుతు న్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పోడు వ్యవసాయం మూ లంగా అడవులు అంతరించి పోతుండడం, మరోవైపు వేటగాళ్ల వల్ల అటవీ క్షీణతవల్ల వన్య ప్రాణులు కను మరు గవుతున్నాయి. ఇలా రోజురోజుకూ వన్యప్రా ణుల సంఖ్య తగ్గుతుండడం కలవరానికి గురిచేస్తున్న ది. గతరెండు రోజుల క్రితం దామరవాయి గ్రామం లో మధ్యేనికుంట అడవి ప్రాంతంలో వేటగాళ్లు అమ ర్చిన విద్యుత్ తీగలు, విద్యుత్ లైనుకు తగిలించి చాలా దూరం వరకు విద్యుత్ ఉన్న తీగను పరిచారు. విద్యుత్ లైన్మెన్ ఆతీగలను గ్రామస్తుల సహకారం తో స్వాధీనం చేసుకున్నారు. లింగాల గ్రామపంచా యతీ పరిధిలోగల ఓ గ్రామం నుండి అడవి జంతు వు మాంసం తీసుకెళ్తూ మంగపేట మండల ఫారె స్ట్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గ తంలో కొడిశెల ప్రాంతంలో ఉన్న గుత్తి కోయలు పులి ని వేటాడి సంఘటన కూడా విధితమే. మండలం లోని పలుగ్రామాలు ఈవేట నిరాటంకంగా సాగుతు న్నది. ప్రభుత్వం స్పందించి అటవీ అధికారులు, సిబ్బంది వేటగాళ్లను గుర్తించి శిక్షించేలా ఆదేశించాలి. వన్యప్రాణులను సంరక్షించకపోతే మానవ మనుగడ కే ముప్పు వాటిల్లుతుంది. అందుకని, ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఈ దిశగా కదలాలి.