Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరి వేయమన్న బీజేపీ నేతలు ఎక్కడ ?
- కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి
- మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్ ఫైర్
నవతెలంగాణ-పెద్దవంగర
బీజేపీయేతర రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్ని కైన ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. శనివారం మండలంలోని బీ సీ తండా, పెద్దవంగర గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాలను జాయింట్ కలెక్టర్ డేవిడ్, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బీజేపీ విధానాలపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందన్నారు. కేం ద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదిన్నరేళ్లలో ప్రజల కోసం చేసింది శూన్యమని విమర్శించారు. బీజేపీవి ధానాలపై దేశ వ్యాప్తంగా ప్రజలు గుర్రుగా ఉన్నారని, రాబోయే రోజుల్లో బీజేపీ ప్రజల ఆగ్రహానికి లోనుకాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో నాడు వరి వేయ మని చెప్పిన బీజేపీ నేతలు నేడు కనిపించకుండా పో యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలోనే రా ష్ట్రం అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప క్క రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పథ కాలు అమలవుతున్నాయని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటుగా రైతు బంధు, రైతు బీమాఇచ్చిన ఘనతసీఎంకేసీఆర్కే దక్కుతుంద న్నారు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీనికోసం ప్రతి ఏటా 3000 కోట్ల నష్టాన్ని భరిస్తూనే రైతులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. రైతులు బాగా డిమాండ్ కలిగిన పంటల వైపు దష్టిసారించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్ఫామ్, కూరగాయలు, పప్పుదిను సులు పండించేలా అధికారులు ప్రోత్సహిం చాలన్నా రు. రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వర కు కొనుగోలు చేస్తామన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా అధికారులు సన్యాసయ్య, ఛత్రు నాయక్, నలిని, వెంకట్, ఎస్డీ ఖుర్షీద్, ఆర్డీఓ రమేష్, నాయకులు ఐలయ్య, రామచంద్రయ్య శర్మ, నెహ్రూ, సోమ నరసింహారెడ్డి, సుధీర్, సంజరు, శ్రీనివాస్, రవి, సోమరెడ్డి, రాజు, తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచులు లక్ష్మి, పద్మ దేవేందర్, ఏపీఎం నరేంద్ర కుమార్, ఏఓ కుమార్, సీసీ సుధాకర్ పాల్గొన్నారు.