Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నైజం పాలకులు విస్నూర్ దేశ్ ముఖ్ పై పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీర పోరాటయోధుడు నల్ల నర్సింహులు అని పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు మాచర్ల సారయ్య, జన గామ జిల్లా పోప సహయకార్యదర్శి చిదురాల ఎల్లయ్య అన్నారు. నల్లా నర్సిం హులు 29వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జనగామ జిల్లా పాలకుర్తి ని యోజకవర్గ కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పద్మశాలి సం ఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడారు. నల్ల నరసింహులు విస్నూరు దేశ్ ముఖ్ రామ చంద్రారెడ్డి జనగామ తాలూకా ప్రాంతంలోని 60 గ్రామాల్లో ఆయన కుటుంబం కొనసాగిస్తున్న అరాచకాలపై ఎదురుదాడికి దిగిన నల్ల నరసింహులు అన్ని గ్రామాలలో దళాలను ఏర్పాటు చేసి రజాకార్లను గ్రామాలకు రాకుండా తరిమి కొట్టారని, పేద ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలను వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిం చాలని అంతేకాకుండా ఆయన విగ్రహాలను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు అన్ని ని యోజకవర్గ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమేష్, చిదురాల మార్కండేయ, కాటబత్తిని సోమేశ్వర్, వైట్ల లక్ష్మీపతి, పోగు చిరంజీవి, కూరపాటి సుదర్శన్, పెనుగొండ సోమేశ్వర్, వైట్ల రామ్మూర్తి, మాజి ఎంపిటిసి దేవసాని కపాకర్, వల్లాల గౌరయ్య, సోమన్న, మార్గం సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.