Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
యాంత్రిక జీవనంలో ప్రతి మనిషి ఒత్తిడికి లోనవు తున్నాడని దీనివలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తొర్రూరు లైన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ రేగూరి వెంకన్న అన్నా రు. శనివారం స్థానిక లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూరగాయ ల మార్కెట్ సమీపంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఉచిత షుగర్, బీపీ, పల్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి అపూర్వ స్పందన వచ్చిందని, ఈ శిబిరంలో 111 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ చంద్ర శేఖర్ ఆర్య, డాక్టర్ సురేష్ పాల్గొని పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు సూచనలు చేశా రన్నారు. ఈ జబ్బులు వచ్చే అవకాశలు ఎక్కువ వీటికి నివారణ కొం త వరకు మనం తగ్గిచ్చు కోవచ్చు యోగ, మెడిటేషన్, నడక, శారీరానికి వ్యాయాయం అవుతుందని, ఇవన్నీ లేక రోగాల బారిన పడవలసి వస్తుంది అని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ ప్రతాపని వెంకటేశ్వర్లు, క్లబ్ అధ్యక్షులు మాదారపు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి నాళ్ళ కష్ణమూర్తి, కోశాధి కారి తమ్మి రమేష్, బిజ్జాల శ్రీనివాస్, చిదర మహేష్ తదితరులు పాల్గొన్నారు.