Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
నవతెలంగాణ-గూడూరు
విద్యార్థినిల పట్ల అజాగ్రత్తగా వహిస్తేచర్యలు ఉంటా యని ఎమ్మెల్యే బానత్ శంకర్ నాయక్ అన్నారు శనివారం మండలంలోని మర్రి మిట్ట గ్రామం పరిధిలోని జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల ను ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంద ర్శించారు. ఇటీవల పాఠశాల నుండి రాత్రివేళలో బయటకు వెళ్లిన ఒక విద్యార్థిని ఘటనపై ఆరా తీశారు ప్రిన్సిపాల్ శ్వేత, ఉపాధ్యాయుల తో మాట్లాడారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడారు భోజన వసతులపై అడిగి తెలుసుకు న్నారు ప్రభుత్వ అందిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మం చి భవిష్యత్తును ఎంచుకోని విధంగా లక్ష్యసాధన కోసం చదవాలని సూచించారు విద్యార్థిని బయటకి వెళ్ళిన ఘటనపై ఆర్ సి ఓ రాంరెడ్డి విచారణ చేపట్టి నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు పంపనున్నట్లు తెలిసింది ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.