Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని
నవతెలంగాణ-ములుగు
విద్యార్థులలో దాగిఉన్న కళా నైపుణ్యాలను వెలికి తీసి సామాజిక చైతన్యం, నిరక్షరాస్యత, అంటరాని తనం, పర్యావరణం తదితర అంశాలపై అవగాహన కలిగేలా కళా ఉత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశా ఖ అధికారి పాణిని తెలిపారు. శనివారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ కళాఉత్సవం-2022 పోటీల నిర్వహణ ఈ నెలలో ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించ బ డుతుందన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకుల, సంక్షే మ పాఠశాలల్లో 9 నుండి 12వ తరగతి వరకు చదు వుతున్న బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు నని పేర్కొన్నారు. అనంతరం పోటీలలోని విభాగాలు వెల్లడించారు. గాత్ర సంగీతం-శాస్త్రీయ, గాత్ర సంగీ తం-జానపద, వాయిద్యసంగీతం- శాస్త్రీయ, వాయి ద్య సంగీతం-జానపద, శాస్త్రీయ నత్యం, జానపద నత్యం, విజువల్ఆర్ట్స్ 2డి, విజువల్ ఆర్ట్స్ 3డి, భారతీ య బొమ్మలు, ఆటలు, ఏకపాత్రాభినయం అనే 10 విభాగాలలో పోటీల నిర్వహణ ఉంటుందన్నారు.
ఈ నెల 15 నుండీ 17 వరకు మండల స్థాయి పోటీలకు ప్రతీ పాఠశాల నుండి ఒక్కొక్క విభాగం నుండి ఒకబాలుడు, బాలికను పంపించాలని అనం తరం విజేతలుగా నిలిచినవారి వివరాలు ఈనెల 18 జిల్లా కు పంపించాలన్నారు.
22 నుండి24వరకు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు ప్రతీ మండలం నుండి ప్రతీ విభాగంలో మొదటి స్థానంలో ఉన్న ఒక బాలుడు, ఒక బాలికను పంపించాలని, విజేతల వివరాలు 26 నాటికీ రాష్ట్రా నికి పంపిస్తారన్నారు. డిసెంబర్ 5 నుండి 8 వరకు రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాస్థాయిలో ప్రతీ విభాగం లో మొదటి స్థానంలో ఉన్న ఒక బాలుడు, ఒక బాలి కను పంపిస్తారని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థు లలో కళలను గుర్తించి ఉపాధ్యాయులు, ప్రధానోపా ధ్యాయులు, యాజమాన్యాలు ప్రోత్సహిస్తూ ఈ పోటీ ల్లో పాల్గొనడానికి సహకరించాలన్నారు. అదనపు స మచారం కోసం క్వాలిటీ కో-ఆర్డినేటర్ బద్దం సుదర్శ న్రెడ్డిని సెల్ నెంబర్ 9603672289లో సంప్రదించాలని ఆయన కోరారు.