Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
జనగామ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని సీపీ ఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో ఆ యన మాట్లాడుతూ జనగామమున్సిపాలిటీ అవినీతికి అడ్డాగా మారిందని పట్టణ సుందరీకరణ పనులుఏళ్లు గడుస్తున్నా నేటి వరకు పూర్తి కాకపోవడంలో ఆంత ర్యం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో ఇంటి నెంబర్ల ఏర్పాటు కోసం రూ. 25లక్షలు ఖర్చు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలన్నారు. డివైడర్ల నిర్మాణం పనుల్లో నాణ్యత లోపంతో కూలిపోతున్నాయని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దోమలు, ఈగల బెడద అధికమైందన్నారు. బ్లీచింగ్ పౌడర్వేయక, దోమలఫాగింగ్ చేయక పట్టణంలో దోమల అధికమయ్యాయ న్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం రోజువారి కూలీలను నియమిస్తామని చెప్పడ మే తప్ప ఎక్కడ సక్రమంగా పనులు నిర్వహించింది లేదన్నారు. పనులు చేయ కుండా ఎంబీ రికార్డు చేసుకొని డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. తప్పుడు బిల్లులతో డబ్బులు దండుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ప్రేక్షక పాత్ర వహిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ జమున, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలే బాధ్యత వహించాలన్నారు. మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి పై పట్టణ ప్రజలను చైతన్యం చేసే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం జనగామపట్టణకార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబొట్లశ్రీనివాస్,నాయకులు ఎండి అజారుద్దీన్, పట్టణ కమిటీ సభ్యులు పందిళ్ళ కళ్యాణి, పల్లెల లలిత, కళ్యాణం లింగం తదితరులు పాల్గొన్నారు.