Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పట్ల బీజేపీ కుట్ర
- మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-రఘునాథపల్లి
వరి ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించ కుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరపొందాలని తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీ సర్కారుకుట్ర చేస్తుందని మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజ య్య అన్నారు. శనివారం రఘునాథ్‌పల్లి మండలం గోవర్ధనగిరి కిలాసాపురం ఇబ్రహీంపురం లక్ష్మీ తండా మాదారం గ్రామాల్లో పర్యటించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారు లకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన కేం ద్రాన్ని ప్రతిరైతు సద్వినియోగంచేసుకోవాలన్నారు. ప్రతిగింజ చివరివరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుందని కొంత అల్సమైన రైతులు భయపడవద్దని తెలిపారు. ఈసందర్భంగా మండల పరిషత్ కార్యాల యంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, టీఆర్ఎస్ మండల అధ్య క్షులు వారాల రమేష్ యా దవ్, కార్యదర్శి ముసి పట్ల విజరు, జిల్లా సర్పంచ్ల ఫో రం అధ్యక్షులు పోకలశివ కుమార్ గుప్తా, ఎంపిడివో అసీం, తహశీల్దార్ అన్వర్ నాయకులు శివరాత్రి రా జ్, సురేష్, మార్కెట్ డైరెక్ట ర్లు నూనె ముంతల యాక స్వామి,శంకర్, సర్పంచ్‌లు సుంకరి అనిత శ్రీనివాస్, శ్రీధర్‌గౌడ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : వరి ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోవిక్రయించి మద్దతు ధరపొందాలని ఎమ్మె ల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు.. శని వారం మండలంలోని నెల్లుట్ల, పటేల్ గూడెం, నవాబుపేట, కళ్లెం గ్రామాల్లో పర్యటించి ఐకెపి, పిఏసిఎస్ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు చిట్ల స్వరూపరాణి భూపాల్‌రెడ్డి, పి దేవేం ద్ర, బూడిది జయరాజేశ్వర్ ,తిప్పారపు ఈరమ్మ, ఎం పిపి చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, ఎంపి టిసిలు సిద్దు లు, కృష్ణవేణిశ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ అంజయ్య, ఎంపిడివో సీతారాం, ఐకెపి ఏపిఎం శంక రయ్య, పిఏ సిఎస్ చైర్మన్ ఉపేందర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయు లు, రాజు ,మహేష్, బాలరాజు, మండల యూత్ అధ్యక్షుడు శ్రీవారి, విష్ణు, ఎల్లస్వామి ,ఆనంద, మహిళ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జఫర్గడ్ : మండలంలోని తీగారం , తమ్మడ పల్లి (ఐ),కూనూర్, కొనయచలం ,తీడుగు, జఫర్గడ్, ఓబులాపుర్, తిమ్మాపూర్ , తమ్మడపల్లి జి, సురారం గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర చైర్మన్ల పోరం వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల కరుణా కర్రావు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొ నుగోలు కేంద్రాలలో రైతులువరి ధాన్యాన్ని అమ్ము కోవాలని సూచించారు. రైతులు ఆగం కాకూడదని కేంద్ర ప్రభుత్వం గొర్రెలు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు బాగుపడాలని మద్ద తుధర లభించాలని రైతులకు వరి ధాన్యం అమ్ముకో వడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాడని తెలియజేశారు.
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని వరికి మద్దతు ధర తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ కొత్త సాంబ రాజు, ఉప సర్పంచ్ తుమ్మ రవికుమార్, పిఎసిఎస్ సీఈవోలు అంగిడి భాస్కర్, కుల్ల అనిల్, తదితరులు పాల్గొన్నారు.