Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఆల్ హమాలీ వర్కర్ ఫెడరేషన్ యూనియన్ (సీఐటీ యూ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల సోమన్న అన్నారు.ఆల్ అమాలి కార్మికు లు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తహశీల్దార్ పాల్సింగ్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ లో ను రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న హమాలీ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అన్నారు. ప్రమాదాలు జరిగి మరణిం చిన హమాలీ కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీరేట్ల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు.హమాలీ కార్మి కులకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని. 50 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. హమాలీ కార్మికులకు పని ప్రదేశాల్లో కనీస సౌక ర్యాలు కల్పించాలని హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. 600 బస్తాల వరకు ట్రాన్సోపోర్టు వాహనాలకు తాడు కట్టినందుకు తాడు మామూలు రూ.500లు, అర్హులైన హమాలీలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్ర మంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాండ్ర ఆనందం, హాల్ హ మాలీ మండలకార్యదర్శి భారత దేవేందర్, మల్లేష్ రాజ్, గాదరి ఇస్తారి, సోమయ్య, అనుముల రమేష్, డి సోమన్న తదితరులు పాల్గొన్నారు.