Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొత్తికోయ గూడాల్లో అటవీశాఖ అధికారుల తనిఖీ
- 'నవతెలంగాణ' వార్తకు స్పందన
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని ఏజెన్సీ అడవి ప్రాంతాలలో అటవీశాఖ అధికారులు అలజడి చేశారు. నిన్న శుక్రవారం నవతెలంగాణ దినపత్రికలో యదేచ్చగా సాగుతున్న వన్యప్రాణుల వేట అనే శీర్షిక ప్రచురితం కావడంతో ములుగు జిల్లా అటవీ శాఖ అధికారి (డిఎఫ్ఓ) కిష్ట గౌడ్, ఎఫ్డీఓ ప్రశాంత్‌ల ఆధ్వర్యంలో లింగాల, పస్రా, తా డ్వాయి రేంజ్ లోని టెరిటోరియల్, వన్యప్రాణి విభాగాల అటవీ శాఖల అధికా రులు సెక్షన్, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందితో అనుమానితులుగా ఉన్న వే టగాళ్ల ఇళ్లు, గుత్తికోయగూడాల్లో సోదాలు నిర్వహించారు. లింగాల రేంజ్ అధి కారి చిర్ర శ్రీనివాస్ ఒడ్డుగూడెం కొడిశెల అటవీ ప్రాంతాల్లో సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. అడవి జంతువుల నీటి స్థావరాలకు రక్షణ కల్పించారు. అటవీ సం పద జాతీయ సంపదని దానిని కాపాడడం, సంరక్షించడం అందరి బాధ్యతని అవ గాహన కల్పించారు. తాడ్వాయి రేంజ్ అధికారులు, సిబ్బంది దామరవాయి, పం బాపూర్, నర్సాపూర్ బీరెల్లి గ్రామాల్లోని అడవి ప్రాంతాల్లో సందర్శించి పరిశీలిం చారు. వన్యప్రాణులు వేటాడితే చట్టరీత్యా పీడీకేసు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. జాతీయ సంపద కాపాడడంలో యువత, ప్రజలపాత్ర ముఖ్యమన్నారు.