Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సెంటర్లో ఓటు వినియోగంపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఛాయా చిత్ర ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తహసీల్దార్ వై.శ్రీనివా సులు, ఎంపీడీఓ కర్నాటి శ్రీధర్లు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓటుహక్కు ప్రతిపౌరునికి వజ్రాయుధంలాంటిదని ఓటు నిజాయితీగా నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటు హ క్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఓటరు ఆధార్ నెంబర్ అనుసంధా నం చేసుకోవాలని 18ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటు హక్కు నమో దు చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ పరిసరాల పరిశుభ్రత మరియు ఓటర్ ఐడిని ఆధార్ కార్డుతో అనుసంధానం ఓటర్ ఐడిలోని ఇంటిపేరు హౌస్ నెంబర్ సవరణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చాయచిత్ర ప్రదర్శన నిర్వహిం చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర రావు, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్ఐలు సునీల్ కుమార్, కుమారస్వామి, సీనియర్ అసిస్టెంట్ ఏసుపాదం, సిబ్బంది పాల్గొన్నారు.