Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్
నవతెలంగాణ-తాడ్వాయి
బాలలు జాతిసంపద అని వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని ము లుగు జిల్లా బాలల పరిరక్షణ అధికారి జై ఓంకార్ పేర్కొన్నారు. శనివారం మేడా రంలోని ఐటీడీఏ సమావేశమందిరంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యం లో సమ్మక్క-సారలమ్మ పూజారులు, చిరు వ్యాపారస్తులకు బాలల హక్కుల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ బాలలహక్కుల గురించి బాలలందరు తెలుసుకోవాలని, బాలల హక్కులు ము ఖ్యంగా జీవించే హక్కు, అభివద్ధి చెందే హక్కు, భాగ్యస్వామ్యంహక్కు, రక్షణ పొం దే హక్కులన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాలల రక్షణకై జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సంస్థల సేవలను పొందాలని పేర్కొ న్నారు. తెలంగాణలోని అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతరలో భిక్షాటన చేస్తూ చిన్నపిల్లలు ఉండడం చాలా బాధాకరమని జాతర సమయంలో, సాధారణ సమ యంలో చిరు వ్యాపారస్తులువారి దుకాణాలలో పిల్లలతో పనులు చేయించడం, వారిని బాల కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
జాతర సమయంలో వలస, వ్యాపారపరంగా వచ్చిన వారు ఇక్కడే ఉండిపో తున్నారని, పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల హ క్కులకు భంగంకలిగిస్తూ, వారి బాల్యాన్ని చిదిమేస్తున్నారని, అలాం టి వారిని చూసిన వెంటనే 1098 నెంబర్‌కి ఫోన్ చేసి సమాచారాన్ని తెలియ జేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూజారులు మునేందర్, లక్ష్మణరావు, ఐసిపిస్ సోషల్ వర్కర్ జ్యోతి, చైల్డ్ లైన్ చంటి, పూజారులు, ఎండోమెంట్ అధికారులు, దుకాణ యజమానులు, అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.