Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పాలనలో ఆత్యస్థైర్యంతో దివ్యాంగులు
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- టీఆర్ఎస్ పానలో 100 శాతం సబ్సిడీతో దివ్యాంగులకు ట్రైసైకిల్స్
- జిల్లాలోని దివ్యాంగులకు నెలకు రూ.2 కోట్ల 20 లక్షలకు పైగా పెన్షన్లు
- రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
దివ్యాంగుల సంక్షేమమే టిఆర్ఎస్ లక్ష్యమని కెసిఆర్ పాలనలో దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళలు, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సేవా భవ న్లో జిల్లాలోని దివ్యాంగులకు ట్రై సైకిల్స్, కత్రిమ సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈజార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర , రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మెస్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డిలు ముఖ్య అతిథిగా హజరై రూ.11 లక్షల వ్యయంతో 72 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్, 10 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు ఉచితంగా పంపిణీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భాతరదేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు నెలకు రూ.1,010 అందజేసూ ప్రతి రూ. 12వేల కోట్లకు పైగా పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కు తుందన్నారు. దివ్యాంగులను ఆర్ధికంగా మరింత అభివద్ధి చెందా లనే లక్ష్యంతో డబుర్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో విద్యా, ఉద్యోగ, వైద్య రంగాల్లో శాశాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర వికలాంగుల సం స్థ కార్పోరేషన్ చైర్మెన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. 30 శాతం సబ్సిడితో మాత్రమే వికలాంగులకు సహాయ ఉపకరణములు అందేవని తెలంగాణ ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ పార్టీలో రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగు 100శాతం సబ్సిడీతో సహాయ ఉపకరణములు అందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీలు చేస్తున్నామని వివరించారు. అప్పట్లో ఆయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వికలాంగుల సహకార సంస్థ ద్వారా 500 యూనిట్లు మంజూరు చేశామని, మున్ముందు మరిన్ని ఎక్కువ యూనిట్లు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ కొత్త హరి బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ వల్లేపు శోభ రఘుపతిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బుర్ర రమేష్, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్థన్ , పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్, కౌన్సిలర్లు నూనె రాజు పటేల్, శిరువ అల్ ఖద్దీ సమ్మయ్య, మంగళపెల్లి తిరుపతి, ముంజంపల్లి మురళీధర్, ముంజాల రవీం దర్, డిమబ్ల్యూ శామ్యూల్, డీఆర్ఎఎడీఓ పురుషోత్తం, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ ఓడ్డి, టీఆర్ఎఎస్ నాయ కులు శ్రీని వాస్, కమలాకర్, రాయమల్లు, తాటి అశోక్, పిల్లల మర్రి నారా యణ, పిల్లా వేణు, సింగనవేణి చిరంజీవి యాదవ్, మేను తిరుపతి, వికలాంగులు సంఘం నాయకులు నీలాంబరం, నర్స య్య, నర్సింగరావు, టీఆర్ఎస్ యూత్ తదితరులు పాల్గొన్నారు.