Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
- జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లబెల్లి
రైతులు పెట్టిన పెట్టుబడులు రాక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని, దానికి కారణమైన ప్రభుత్వాలు పెట్టుబడికి తగ్గట్టు గిట్టుబాటు ధర కల్పించి రైతుల ఆత్మహత్యలు ఆపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బాబు అన్నారు. మండలంలోని రుద్రగూడెం గ్రామంలో గురువారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కంద్రంలో, రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలతో ఇబ్బందులకు గురువుతోందన్నారు. పెట్టుబడి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభు త్వం విద్యుత్తు, ఎరువుల సబ్సిడీ, పురుగు మందుల రేట్లు పెంచి రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నదని అన్నారు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక ఇప్పటి వరకే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నార న్నారు. ప్రజలను, రైతులను దోచి ఆదాని, అంబానీ లకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు రైతులు రైతు కూలీలు ఏకమై పోరాడాలని కోరారు. రైతులకు నకిలీ విత్తనా లను అంటగట్టే కంపెనీలను మూసివేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని కోరారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కడియాల మనోహర్ మాట్లాడుతూ... రైతు సంఘం ఆధ్వర్యంలో ఆసరవెల్లి కొండాపూర్, గోవిందాపూర్, నాగరాజు పల్లి, మేడపల్లి నల్లబెల్లి తదితర గ్రామాల్లో పేదలకు భూములు, హక్కు పత్రాలు, బ్యాంకు రుణాలు ఇప్పించామని అన్నారు. అర్హులైన వారికి పట్టాలు, హక్కు పత్రాలు సాధించడానికి రైతులందరూ ఏకం కావాలని కోరారు. 2022 జనవరి 11 నుండి వారం రోజులు భారీ రాళ్ల వర్షాలు పడి కోట్లాది రూపాయలు నష్టపోయిన రైతు లకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడియాల మనోహర్, ఇస్లావత్ నేహు, బొడిగె సమ్మయ్య, రవి, ఖల్నాయక్, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, లింగయ్య, రమేష్, పాపయ్య సునీల్, హేమ, సంపత్ రావు, రైతు సంఘం నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.