Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి
- టీఆర్ఎస్ యువజన విభాగం
- రాష్ట్ర నాయకులు డాక్టర్ సుధాకర్
నవతెలంగాణ-పాలకుర్తి
నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మోసం చేసిన మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని, ఉద్యోగాలు ఇవ్వలేని మోడీ గో బ్యాక్ అని టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయ కులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడా రపు సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యువజన, విద్యార్థి విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతో పాటు దేశ ప్రజలను మోసం చేసి కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని అన్నారు. 8 ఏండ్ల బీజేపీ పాలనలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా నేటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. హామీలు అమలు చేయలేని మోడీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనెల 12న తెలంగాణలోని రామగుండానికి మోడీ వస్తున్నారని, మోడీ పర్యటనను వ్యతిరేకించి నల్లజెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. విభజన చట్టంలోని ఐఐటి, ఐఐఐఎన్, త్రిబుల్ ఐటీ వంటి విద్యాసంస్థలను స్థాపించకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీలను నెరవేర్చ లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేసినందుకు తెలంగాణ సమాజా నికి మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ నెలకొల్పుతా మని హామీ ఇచ్చి విస్మరించిన మోడీకి గుణ పాఠం తప్పదని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని మోడీ పర్యటనలోపు ప్రకటన చేయాలని, లేదంటే ప్రధాని మోదీ పర్యటనను టీఆర్ఎస్ యువజన సమితి పక్షాన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మారుజోడు సంతోష్, పాలకుర్తి నియోజకవర్గం యువజన, టీఆర్ఎస్వీ సోషల్ మీడియా నాయకులు జోగు కుమార్, కోడం సాయిరాం,జోగు కష్ణ, కె.వేంకటేష్, వంగాల భాస్కర్, అశోక్, సునిల్, హరిష్, అఖిల్, కూమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.