Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసి ప్రాంగణంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడాన్ని సంబంధిత శాఖ రీజనల్ మేనేజర్ శ్రీదేవి ఆక్షేపణ వ్యక్తపరిచారు. ఏఎలాంటి అనుమతులు లేని పనులు ఎవరు చేస్తున్నారని గురువారం ఆర్టీసీ స్థలంలో జరుగుతున్న పనుల్ని పోలీసుల సాయంతో అడ్డగించింది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్ పరిధి స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండానే డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నారని ఆర్టీసీ కంట్రొలర్ ఇచ్చిన సమాచారంతో ఎవరూ చేస్తున్నారని ఆరా తీయగా స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్ అని తెలిసింద న్నారు. వెంటనే పనులు నిలిపివేయాలని పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదన్నారు. దీంతో పోలిస్ స్టేషన్ లో ఫిిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా తిరిగి మరలా పనులు జరు గుతున్నాయని తెలిసి వచ్చినట్లు చెప్పారు. ఆర్టీసి స్థలంలో ఏ పని జరగాలన్న ఉన్నతాధికారుల అను మతి తప్పనిసరి అన్నారు. అయినా భేఖాతర్ చేయడంతో మరోమారు పోలిస్ స్టేషన్లో ఫిిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాఘవేందర్, ఎస్సై శ్రావణ్, వరంగల్ డిపో మేనేజర్ సత్యనారాయణ, డీఈ భాస్కర్, సిబ్బంది, కంట్రోలర్ రఘువీర్, తదితరులు పాల్గొన్నారు.