Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పర్వతగిరి
బాలలు అత్యవసర పరిస్థితుల్లో 1098కు కాల్ చేయాలని సీఐ శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గురువారం చైల్డ్ లైన్ ఆధ్వర్యంలోఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఇన్చార్జి హెడ్ మాస్టర్ మహేందర్ అధ్యక్షతన నిర్వహించారు. సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ అజ్మీర కోమి, ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. 1098కు వచ్చిన సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు సైబర్ క్రైమ్ బారిప పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు తెలియజేయాలన్నారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే 1098 కు సమాచారం అందించాలని చెప్పారు. మండ లంలో ఎంసీపీసీ కమిటీ, 33 గ్రామపంచాయ తీల్లో వీసిపిసి కమిటీలు స్థాపించామన్నారు. బాలల స్నేహపూర్వక మండలంగా తీర్చిదిద్ధా లని కోరారు. చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ వీరబాబు మాట్లాడుతూ చైల్డ్ లైన్ వరంగల్ జిల్లాలో 2018 లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 73 కేసులు నమోదుయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దేవేందర్, చైల్డ్ లైన్ మండల్ ఇంచార్జి రమేష్, సర్పంచ్ చింతపట్ల మాలతి, ఎంపీటీసీ మాడుగుల రాజు, స్కూల్ ఛైర్మెన్ వీరన్న, చైల్డ్ లైన్ సభ్యులు ప్రభ, నిర్మల, హరీష్, మమత, రమేష్, అంగన్వాడీ టీచర్లు మంజూభార్గవి, సుమలత, ఏ ఎన్ ఎం సుమలత, తదితరులు పాల్గొన్నారు.