Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలాజీ సోషల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్
నవతెలంగాణ తొర్రూరు
ప్రతి ఒక్కరు సమాజ సేవకు పునరంకిత మవ్వాలని బాలాజీ సోషల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు నర్కుటి సంతోష్ తెలిపారు. గురువారం డివిజన్ కేంద్రంలో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవసరా ర్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుండాలని కోరారు. బాలాజీ సోషల్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం నూతన కమిటీలను ప్రకటించారు. జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన రేబెల్లి సోములు, ప్రధాన కార్యదర్శిగా భూతం నరసింహ, కోశాధికారిగా చార్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా రేబెల్లి గంగారాం, అలాగే డివిజన్ అధ్యక్షులుగా నరుకుటి చలపతి రాజు, ప్రచార కార్యదర్శిగా తూర్పాటి సాంబశివ, డివిజన్ సలహాదారులుగా కొండపల్లి శేషాద్రి, ఉపాధ్యక్షులుగా తూర్పాటి వరదరాజు, మండల అధ్యక్షులుగా సిరిపాటి కండే రావు, పట్టణ అధ్యక్షులుగా కిన్నెర సాంబ, మండల ప్రధాన కార్యదర్శిగా మాదేని మహంకాళి, ఉపాధ్యక్షులు గా గిత్త వెంకన్న, సలహాదారులుగా మాదేని వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శిగా చిత్తారి మదార్, యూత్ అధ్యక్షులుగా చార్ల సాకేత్ ఎన్నికయ్యారు.అనంతరం కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.