Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
డైలీ వైజ్ వర్కర్లందరిని క్రమబద్ధీకరించాలని డైలీ వైజ్ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు సౌందర్య డిమాండ్ చేశారు. గురువారం దీక్ష లో పాల్గొని ఆమె మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేపట్టి 11 రోజులైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఇన్ని రోజులు వెట్టిచాకిరి చేయించుకుని వేతనాలు అడిగితే కాలయాపన చేయడం సరైనది కాదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించి సెలవుతో కూడిన 12 నెలల జీతాలు ఇవ్వాల న్నారు. మహిళలకు ప్రసూతి సెలవులతో పాటు లాక్ డౌన్ సమయంలో రావాల్సిన ఎనిమిది నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో డైలీ వైజ్ వర్కర్లు, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.