Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం లోనే రైతులు ధాన్యం విక్ర యించి మద్దతు ధర పొందాలని ఏపీఎం రఘోత్తం రెడ్డి, సర్పంచ్ కొట్టెం సావిత్రి వజ్జయ్యలు అన్నారు. గురువారం మండలం లోని కోనాపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు. ఏ గ్రేడ్ రకానికి రూ.2080, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర అందిస్తుందనానరు. దళారులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అరవింద్, ఎంపీటీసీ ననుబోతుల స్వప్న లింగన్న,ఉప సర్పంచ్ తక్కెళ్ళపల్లి దేవేందర్ రావు, ఐకెపి సీసీ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.