Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలగణపురం
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సూచనలను సలహాలను పాటించి ఆస్పత్రి అభివృద్ధికి పాటుపడాలని ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం డాక్టర్ కర్ణాకర్ రాజు అధ్యక్షతన జరిగింది. ఎంపీపీ పాల్గొని మాట్లాడుతూ ఆసుపత్రి అభివద్ధి కమిటీ ఉందన్న విషయం కూడా ప్రజలకు తెలవదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి అభివద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు 2019 నుండి 20 వరకు ఎలాంటి లెక్కలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత యూడీసీ పృథ్వి అదే రికార్డులు ఉన్నాయని డాక్టర్ చెప్పడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2020 నుండి 22 వరకు ఆసుపత్రికి కేటాయించిన నిధులను అభివృద్ధి కమిటీ ప్రమేయం లేకుండానే డాక్టరు వినియోగించారని మండి పడ్డారు. ఆసుపత్రి అభివృద్ధికి కమిటీ అభిప్రాయాలను తీర్మానాలను చేశాకే నిధులు ఖర్చు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్ విజయ మనోహర్, ఎంపీటీసీ భిక్షపతి, తాసిల్ధార్ అంజయ్య, ఎంపీడీఓ సీతారాం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.