Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
రైతులు గోపాలమిత్ర సేవలు వినియోగించుకో వాలని జిల్లా పశువర్ధక శాఖ అభివృద్ధి అధికారి డా క్టర్ సదానందం అన్నా రు.గురువారంమండ లం లోని గుంటూరుపల్లిలో పశుగణాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పువ్వాటి రాణి వెంకటేశ్వర్లు జడ్పిటిసి గొర్రె సాగర్ ప్రారంభించారు. శిబిరాన్ని ఉద్దేశించి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మాట్లాడుతూ రైతులు గోపాలమిత్రల సేవలు వినియోగించుకోవాన్నారు. డాక్టర్ రఘుబాబు కార్యనిర్వా హణ అధికారి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వరంగల్ మాట్లాడుతూ పశువులకు పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడం కోసం జిల్లాలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థ కార్యవర్గ సభ్యులు సిహెచ్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్క ఇంటికి ఒకఆవును పెంచుకోవాలని ఒకఆవు ఎకరం భూమితో సమాన ఆదాయం పొంద వచ్చు అన్నారు. ఈ శిబిరంలో పశువైద్యాధికారులు చిట్యాల ఏడి కుమారస్వామి డాక్టర్ మహతి చల్లగారిగ పశువైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి రంగయ్యపల్లి పశువైద్యాధికారి పశువైద్య సిబ్బంది నెహ్రూ నాయక్ కవిత గోపాలమిత్ర సూపర్వైజర్ ప్రకాష్ రెడ్డి గోపాలమిత్ర సూర లక్ష్మణ్ కుమారస్వామి బండి రవీందర్ బోయిన రవీందర్ రైతులు పాల్గొన్నారు.