Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు
- అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళనే
- గోదావరి నీటితో మండలాన్ని సస్యశ్యామలం చేయాలి
- ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
నవతెలంగాణ-కన్నాయిగూడెం
ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా పట్టింపులేని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యనిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క విమర్శించారు. గురువారం కాం గ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు ఎండి అప్సర్ పాష అధ్యక్షతన నిర్వహించగా సీతక్క మాట్లాడుతూ రాహుల్ గాంధీ భార త దేశంలో భారతంలో భారత్ జోడో యాత్ర చేస్తున్నారని రాహుల్ గాంధీకి దేశ ప్రజలంతా స్వాగతం పలుకుతున్నారని అన్నారు. అలాగే మండలంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడే పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకి సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన వల్ల దేశంలో, రాష్ట్రంలోని, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో అత్యాచారాలు నిరుద్యోగం సమస్య పెరిగిందని ప్రభుత్వాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పోకడల వల్ల వంటగ్యాస్ ధర పెరిగి దేశం లోని పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సైని కులను అగ్నిపత్ పేరుతో ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ధరణి పేరుతో భూస్వాములకు భూములు అంటగట్టే ఆలో చన చేశారని సీతక్క అన్నారు. కన్నాయిగూడెం మండలంలో గోదావరి పక్కనుండి ప్రవహిస్తున్న సుక్క నీరు కూడా మండలానికి ఉపయోగపడడం లేదని ప్రభుత్వం ఏజెన్సీ మండలాన్ని దృష్టిలో ఉంచుకొని గోదావరి నీటిని గ్రావిటీ కాలువల ద్వారా మండల ప్రజలకు అందించి మండలాన్ని పంటలతో సస్యశ్యామలం చేయాలని అన్నారు. అలాగే మండలంలోని రైతులు పోడు భూముల సమస్యలతో సతమత మవుతున్నారని పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్ట కుండా సర్వేచేసి పట్టాలుఇవ్వాలని అన్నారు. ఫారెస్ట్‌అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పక్కాఇండ్ల నిర్మాణంచేపట్టాలన్నారు. ప్రకటించిన పెన్షన్లను వెనక్కి తీసుకోకుండా పెన్షన్లను పెంచి ఇవ్వాలని ప్రభుత్వంపై మండిప డ్డారు. అలాగే ఈనెల 12వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సి టీ ఏర్పాటు కొరకు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపడతామని నియోజక వర్గ ప్రజ లకు పిలుపునిచ్చారు.
దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలి
మండలంలోని పనిచేస్తున్న దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకమును ఇవ్వాలని మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులు ఎమ్మెల్యే సీతక్కకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏజెన్సీ మండలంలో జర్నలిస్టులు గా ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉం టూ మండల ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని అన్నారు.
దళిత జర్నలిస్టులకు తప్పకుండా దళిత బంధు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వర్తింపజేయా లన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగం సమ్మక్క, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, ఏటూరు ఎంపీటీసీ చిట్యాల శైలజ అరుణ్ కుమార్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్, మండల కిసాన్‌సెల్ అధ్యక్షుడు తాటి రాజబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సునార్కని రాంబా బు, బీసీ సెల్ అధ్యక్షుడు కటకం మల్లయ్య ,మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు యా కూబ్పాషా, మండల యువజన సంఘం అధ్యక్షుడు బోట నాగేష్ మండల యువ సేన నాయకుడు సాంబశివరావు సీనియర్ నాయకుడు జాడి రాంబాబు ఎల్లయ్య పాల్గొన్నారు.