Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు పిలుపు
నవతెలంగాణ- కోల్‌బెల్ట్
సింగరేణి సంస్థను, కార్మికులను నిట్టనిలువున దోపిడీ చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి తెలం గాణలో పర్యటించే అర్హత లేదని, సింగరేణి కార్మికు లు ఈనెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రా రంభానికి విచ్చేస్తున్న నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకొని, మోడీ గోబ్యాక్ అంటూ నిరసనలు తెల పాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేజ్‌బోర్డు స భ్యులు మందా నరసింహారావు సింగరేణి కార్మికుల కు పిలుపునిచ్చారు. గురువారం విలేకరులతో మాట్లా డుతూ సింగరేణి సంస్థను, కార్మికులను నిట్టనిలువున దోపిడీ చేసిన దేశప్రధాని నరేంద్ర మోడీకి తెలంగా ణలో పర్యటించే అర్హత లేదన్నారు. సింగరేణి సర్వే చే సిన 15 బ్లాక్ లను సింగరేణి కి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేసి సింగరేణి కి ద్రోహం చే స్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో అతిపెద్ద ఆ స్ట్రేలియా బొగ్గుబ్లాక్ లను అదానీకి వచ్చేలా మోడీ తీవ్ర ప్రయత్నాలు చేసి ఇప్పించడ మే కాకుండా సిం గరేణిలో రూ.3 500 నుండి రూ. 5వేలకు టన్ను ల భిస్తుండగా దేశం లోని 60 విద్యుత్ ప్రాజెక్టులకు ట న్ను రూ.24 వేల తో10శాతం బొగ్గు విదేశాలనుండి దిగుమతి చేసు కో వాలని హుకుంజారీ చేయడం ఎంతవరకు సబబు అ ని ప్రశ్నించారు.
సింగరేణి డబ్బుతో సత్తుపల్లి నుండి కొత్తగూడెం వరకు బొగ్గు రవాణాకు రైల్వే ట్రాక్ ఏర్పాటుచేసి ఓపె న్ కాస్ట్ గనిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన మోడీ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డు రాకుండా అడ్డుకో వడమే కాకుండా, డీఏ కోతలు పెట్టి కార్మికుల పొట్ట కొడుతున్నారని, ఆదాయ పన్ను రద్దు చేయక పోగా సీఎం పీఎఫ్వడ్డీపై కూడాఆదాయపు పన్ను వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ? సింగరేణి లో ఒక్క టెండర్ పడితే ప్రాజెక్టులను అప్పగించే విధా నం లేకపోయినా అరబిందో ఫార్మా కంపెనీకి కోయల గూడెం ఓపెన్ కాస్ట్ ను ఎలా అప్పగించారని మోడీని ప్రశ్నించారు.
కార్మిక చట్టాల నిర్వీర్యం చేసి, తుంగలో తొక్కడ మే కాకుండా 35 శాతం ఓట్లతో గద్దెనెక్కిన మోడీ సింగరేణిలో 51శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సం ఘంగా గుర్తిస్తామనడం ఏంన్యాయం? ఏం ధర్మమని నిలదీశారు. సింగరేణికి, సింగరేణి కార్మికులకు ఇంత ద్రోహం తలపెట్టిన మోడీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని, కార్మికులంతా 12న మొదటి షిఫ్ట్‌లో, యూనియన్ల కతీతంగా మోడీ గో బ్యాక్ అంటూ నిరసనలు తెలపాలని మందా నరసింహారావు పిలుపునిచ్చారు.