Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-మంగపేట
మండలంలో ఇకపై నూతన గృహ నిర్మాణ అను మతులు ఈ పంచాయతీ పోర్టల్ ద్వారానే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గ్రామపంచాయతీ కార్యద ర్శులను ఆదేశించారు. గురువారంమండలంలోని రా జుపేట రైతువేధికలో మండల ప్రత్యేక అధికారి తుల రవి అధ్యక్షతన జరిగిన మండల అధికారుల సమీక్షా సమావేశానికి కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్లు హాజరయ్యారు. ఈ సంద ర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఇకపై నూతన గృహనిర్మాణాలకు అనుమతులు ఈ పంచా యతీ పోర్టల్ ద్వారానే ఇ వ్వాలని అదేవిధంగా గ్రా మ పంచాయతీకి సంబం ధించిన అనుమతులు ఆన్లై న్లో రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలో హరిత హా రంలో భాగంగానాటిన మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టి ఏపుగా పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మల్లూరు, వాగొడ్డుగూడెం బహత్ పల్లె ప్రకృతి వనాలలో బోర్లు వేసేందుకు కలెక్టర్ అనుమతులు మంజూరీ చేశారు. బాలన్నగూడెం, నరేందర్ రావుపేటలలో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణానికి మండల పరిషత్ జ నరల్ ఫండ్ నుండి 12 లక్షలను మంజూరీ చేస్తున్న ట్లు తెలిపారు. మండలంలోని 5028 ఆర్ఓఎఫ్ఆర్ పోడు భూముల ధరఖాస్తులను ఆన్లైన్ చేయాలని అ ధికారులను ఆదేశించారు. సీబీఎఫ్ ఫండ్ నుండి ర మణక్కపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మం జూరు చేశామని అదేవిధంగా మల్లూరు శ్రీహేమాచ ల లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి రూ.10లక్షలతో పెన్షింగ్ ఏర్పాటుకు నిధులుమంజూరు చేసినట్లు కలె క్టర్ తెలిపారు. బ్రహ్మణపల్లి ఆశ్రమ పాఠశాలలో అం గన్వాడీ సెంటర్ ఏర్పాటుకు అనుమతినిచ్చిన కలెక్టర్ ఆరేళ్ల పిల్లలకు పోషకాహార లోపం లేకుండా నెలకు సరిపడా పోషకాహార కిట్స్ వెంటనే అందజేయాలని సిడీపీఓను ఆదేశించారు.మండలంలోని ప్రత్యేక పరి స్థితుల నేపథ్యంలో అధికారులు స్థానికంగా ఉండి మండలంలో జరిగే అభివృద్ధి పనులపై దృష్టి సారించి ప్రగతికి పాటుపడాలన్నారు.
ఈ సమావేశంలో డీపీఓ కొండ వెంకయ్య, తహ సీల్దార్ ఎంపల్లి శ్రీనివాసులు, ఎంపీడీఓ కర్నాటి శ్రీధ ర్, ఎంపీఓ పి.శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్లు పాడి వాసు,పి.యకన్న, ఫారెస్టు రేంజి అధికారి మహమ్మద్ షకీల్ పాషా, ఏపీఓ చరణ్ రాజ్, గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతి కార్యదర్శు లు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరు లు పాల్గొన్నారు.