Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి
నవతెలంగాణ- వరంగల్ కలెక్టరేట్
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు. గురువారం కాకతీయ విశ్వ విద్యాలయ సెనెట్ హాల్లో ప్రిన్సిపాల్ ఆచార్య తాడిశెట్టి శ్రీనివాసులు అద్యక్షతన విశ్వవిద్యాలయ మహిళా ఇంజి నీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థినిలతో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిదిగా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. కాకతీయ విశ్వవి ద్యాలయం నాణ్యమైన విద్యను అందిం చటానికి సిద్దంగా ఉందన్నారు. సమయం విలువ తెలుసుకోవాలని, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచు కోవాలన్నారు. ఎపిజే అబ్దుల్ కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాల న్నారు. ఆత్మరక్షణకు తెగింపు అవసరమని తెలిపారు. దుష్ప్రచారాలు నమ్మొద్దని అన్నారు. పోటి ప్రపంచంలో ఇండిస్టీల డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. చదువుతో పాటు ఇతర రంగాలపై కూడా దృష్టిసారిం చాలన్నారు.
18 ఏండ్లు నిండిన వారు ఓటర్ నమోదు చేసుకోవాలన్నారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ కలిగి ఉన్న వనరులను, ప్రతి అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. అనంతరం కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి మల్లారెడ్డి మాట్లాడుతూ... పరీక్షలకు సంబందించిన నియమ నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం అతిథులను సన్మానించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసులు, కళాశాల అధ్యాపకులు వాణిశ్రీ, స్వప్న, సురేందర్, సాయి తరుణ్, వెంకటేష్ ,స్వాతి, కిషన్, సాహితీ, యశస్విని నాన్ టీచింగ్ సిబ్బంది శంకర్రావు, సంజరు తదితరులు పాల్గొన్నారు.