Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
దళితబంధు లబ్ధిదారులు లాభసాటి వ్యాపార యూనిట్లను ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దళిత బంధు పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో 175 యూనిట్లు మంజూరు చేశామని, పాలకుర్తి 50, జనగామ 60, స్టేషన్గన్పూర్ నియోజకవర్గానికి 75 యూనిట్లు ఉన్నాయని వివరించారు. దళిత బంధు పథకం ప్రత్యేక అధికారులు... లబ్ధిదారులకు లాభసాటి వ్యాపారాలను ఎంపిక కోసం ప్రత్యేక కార్యక్రమాలు, శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులు నైపుణ్యం కలిగిన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపార యూనిట్స్ ఎంచుకుంటే నష్టపోకుండా ఉంటారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులు నష్టపోకుండా ఉండేందుకు అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు, ఆర్డీవో మధుమోహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకన్న, డిఆర్డిఓ రాంరెడ్డి, జెడ్పి సీఈవో వసంత, ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.