Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ
- ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్‌కుమార్
నవతెలంగాణ-భూపాలపల్లి
నరేంద్ర మోడీ గో బ్యాక్ సింగరేణి కాలరీస్ వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో 100 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చ ట్టాలని నాలుగు కోడ్లుగా విభజించిన కార్మిక ద్రోహి గా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజకుమార్ అన్నా రు. శనివారం రామగుండం ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ఏఐటీయూసీ కొమురయ్య భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వ హించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌కుమార్ మాట్లాడుతూ దే శంలో ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలను ఆ దాని అంబానికి కారుచౌ కగా కట్టబెట్టారన్నారు. కేం ద్రంలో నరేంద్ర మోడీ ప్ర భుత్వం రైతుల నడ్డి విరిసే నల్ల చ ట్టాలను తెచ్చి సుమారు 700 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంకు కర్మాగారం గిరిజన యూనివర్సిటీ లాంటి అనేక విభజన హామీ లను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు.లాభాల్లో ఉన్నఎల్ఐసి,సింగరేణి,ఎయిర్‌లైన్స్ విశా ఖఉక్కులాం టి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. 100 ఏళ్లు సాధించుకున్న కార్మిక హ క్కులను నాలుగు కోడులుగా మార్చి కార్మిక హక్కు లను కాలరాస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల ర మేష్, మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు ఇన్విజేందర్, జిశ్రీనివాస్, పూరెళ్ళ శ్రీనివా స్, జీ తిరుపతి, మేక సిద్దయ్య, సెక్రెటరీలు మాటేటి శ్రీనివాస్, కరిముల్లా, దోర్నాల తిరుపతి, కార్మికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గణపురం : కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు శనివారం మండల కేంద్రంలో సిపిఎం మండల కార్యదర్శి చెన్నూరు రమేష్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్ అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు గా చేసి కార్మికులను కట్టు బానిసలను చేశారన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్ లను. విద్యుత్ ప్లాంట్లను ప్రైవేటుపరం చేయడం ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటిని ప్రైవేటుపరం చేయడము వలన రిజర్వేషన్లు కూడా ఉండే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో రేగూరి రాంరెడ్డి, జన్నే రాధక్క కోడెపాక కొమురయ్య,కోడెపాక సుగుణ దూ డపాక లక్ష్మి,జేరిపోతుల అమత, తిక్క రాజేశ్వరి , మల్యాల వనమ్మ, ఎలికేటి సాంబయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే జానీ,మామిడి సదయ్య తదితరులు పాల్గొన్నారు.