Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ, ఆంద్రప్రదే శ్ రాష్ట్రాల పర్యటనలో భా గంగా సిపిఎం , సీపీఐ నా యకులను శనివారం వేలేరు ఎస్సై నవీన్ కుమార్ ముం దస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల బాద్యులు వేల్పుల రవి మాట్లాడుతూ నవంబర్ 11,12 తేదీలలో దేశ ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వామపక్ష పార్టీలు బిజెపి కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తున్నందుకు ముందస్తుగా అరెస్టులు చేసి కేసులు బనాయిస్తూ పోలీసుల ద్వారా అణచివేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారులకు అనుకూలంగా రైతులకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు, ఉద్యోగులకు ప్రజల కు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థ లన్నీ ప్రైవేటుపరం చేస్తూ వ్యవసాయ, కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తుందన్నారు. ఎన్ని అడ్డంకులు సష్టించినా ప్రజల పక్షాన వామపక్షాలు నిలబడి దేశ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. సిపిఐ మండల సహయ కార్యదర్శి గడ్డమీది శంకరయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో విద్యార్థులకు, యువకులకు, కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. మోడీ పాలనలో విద్య ప్రైవేటీకరణ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ జరుగుతుందన్నారు. దేశ వ్యా ప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫ లమైందన్నారు. దేశంలో నిరుద్యోగం సైతం పెరిగిపోయిందని అన్నారు. విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిలో దామెర నరేష్ తదితరులు ఉన్నారు.