Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హన్మకొండ
హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్తు చేపట్టిన తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్య బహత్ గ్రంథాల ప్రచు రణ పరంపరలో రూపొందించిన హనుమకొండ జిల్లా సమగ్ర స్వ రూపం గ్రంథావిష్కరణ శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల స మావేశ మందిరంలో జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎం.సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథా న్ని ఆవిష్కరించారు. తెలంగాణ తరతరాల సాంస్కతిక సంపదను సేకరించి బహద్ గ్రంధాలుగా వెలువరిస్తున్న సారస్వత పరిషత్ ను అభినందించారు. తెలం గాణ గొప్పతనాన్ని గురించిన అక్షర సంపదను ముందు తరాలకు అందించేందుకు ఈ గ్రంథాలు ఉపయోగపడతాయని తెలిపారు.
పరిశోధకులు, కవులు ,రచయితలు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణం గా తెలంగాణ అభివద్ధిపై గ్రంథాలు రచించాలని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రచనల రూపంలో వెలువరించాలని సుధీర్ కుమార్ సూచించారు. సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచారి ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షో పన్యాసం చేస్తూ సారస్వత పరిషత్తు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు ఏడు జిల్లాల సమగ్ర స్వరూప గ్రంథాలు ఆవిష్కతమయ్యాయని, సిద్దిపేట, ఆదిలాబాద్, మంచిర్యాల గ్రంథాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన పరిశోధనా త్మక గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈగ్రంథాలు విలువరిస్తున్నామని పేర్కొన్నా రు. ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య బన్న అయిలయ్య ప్రసంగిస్తూ తెలుగు దీపం కొడిగట్టి పోతున్న కాలంలో వెలసిన నాటి ఆంధ్ర సారస్వత పరిషత్ ,నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసార్హ మైనవని, భాషకు ప్రాధాన్యం తగ్గిపోతున్న ఈ కాలంలో సాహిత్యాభిమానులు సారస్వత పరిషత్తు కృషి అవసరమని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త గన్నమ రాజు గిరిజామనోహర్ బాబు ప్రసంగిస్తూ పరిషత్తు తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య స్వాగతోప న్యాసం చేస్తూ హనుమకొండ సమగ్ర స్వరూప గ్రంథం వెలువటానికి దోహదం చేసిన కోర్ కమిటీ సభ్యులకు, వ్యాసకర్తలకు కతజ్ఞతలు తెలిపారు.సమాచార పొర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ పాల్గొన్న ఈసభను కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎన్.వి.ఎన్.చారి నిర్వహించారు.