Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక గొప్ప వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. శనివారం మండ లంలో ని పొనగండ్ల, కొడవటంచ లింగాలరేపాక, కనుపర్తి,నాగూర్లపల్లి రాయ పల్లి, దమ్మన్నపేట, రేగొండ, గోరుకొత్తపల్లి రామగుండలపల్లి రామన్నగూడెం , పోచంప ల్లి రంగయ్యపల్లి, రూపీరెడ్డిపల్లి, గ్రామాల్లో, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నేరుగా ఎమ్మెల్యే గండ్ర చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక ప్రతి ఇంటిలో ఆడబిడ్డకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక పెద్దన్న లా గా ఒక మేనమామ లాగా వ్యవహరిస్తూ ఒక లక్ష 116 వారికి ఆపద సమయంలో అందిస్తూ వారి మన్ననలను పొందుతున్నా ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కు తుందన్నారు. అలాగే రైతులకు నిరంతర ఉచిత 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నారని అన్నారు. రైతులకు రైతుబంధు రైతు బీమా అందిస్తున్నారని అన్నారు. ఏ రాష్ట్రంలో అమలుచేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారని అన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్న బిజెపి మధ్యతరగతి ప్రజల పెనుబారంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ నిర్మాణానికి ఉసే లేదని అన్నారు.
నీతి అయోగ్సూచనలను తుంగలో తొక్కివారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను సమాన దష్టితో చూడాలని గుజరాత్ ను ఒక దష్టితో తెలంగాణను మరొక్క దష్టితో చూడడం ప్ర ధాని మోదీకి సరైనది కాదని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు వారి సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 54 మందికి గాను 13 లక్షల 3500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కింద లబ్ధిదారులకు అందజేశారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 120 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి జెడ్పిటిసి విజయముత్యం పిఎస్సి చైర్మన్ విజన్ రావు వైస్ ఎంపీపీ ఉమారాణి విద్యాసాగర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ హింగే మహేందర్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీం, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు నడిపెల్లి శ్రీనివాసరావు బండారి కవితా దేవేందర్, నారాయణరెడ్డి,తిరుపతి సుధాకర్ సుమలత భాస్కర్ శ్రీనివాస్,నిశిధర్‌రెడ్డి, ఎంపీటీసీలు సుజాత నర్సయ్య శ్రీధర్‌గౌడ్ ప్రతాపరెడ్డి, నాయకులు సంతోష్, బిక్షపతి,శంకర్,ఐలయ్య భాస్కర్ రెడ్డి, రజినీకాంత్, భద్రయ్య, తిరుపతిరావు, సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.