Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
కేజీబీవీ పాఠశాలల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరి ష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ హనుమకొండ జి ల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.రవీందర్ రాజు, పెండెం రాజు డిమాండ్ చేశారు. శనివారం హసన్‌పర్తి కేజీబీవీ పాఠశాలలో జరిగిన సమావే శంలో వారు మాట్లాడారు. కేజీబీవీ పాఠశాలల్లో కేర్ టేకర్‌ను, వార్డెన్లను నియమించాలని, ఉపాధ్యాయు లకు బేసిక్‌పే ఇవ్వాలని , ఉపాధ్యాయులందరినీ రెగ్యులర్ చేయాలని, మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్లీవులు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సెలవు దినాల్లో పనిచేసిన మహిళా ఉపాధ్యా యులకు వీక్లీ ఆఫ్ వర్తింపచేయాలని, హెల్త్ కా ర్డులను మంజూరు చేయాలని లేని పక్షంలో ఆందోళనను ఉధతం చేస్తామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ హను మకొండ జిల్లా కోశాధికారి డి.కిరణ్ కుమార్, జి ల్లా కార్యదర్శి కార్యదర్శులు సీఎస్ ఆర్.మల్లిక్, పి.చంద్రయ్య, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.