Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ అధికా రంలో కొచ్చిన నాటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి, బీఎస్ఎన్ఎల్ ,రైల్వే, బ్యాంకు ,రక్షణ రంగం తదితర వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారని, రాష్ట్ర విభజన హామీలైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ , గిరి జన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తది తర ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిన మో డీ గోబ్యాక్ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శనివారం సీఐటీయూ జిల్లా ప్రధమ మహాసభ స్థానిక కళ్యాణి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. సీఐటీయూ జెండాను జిల్లా అధ్య క్షులు గాద ప్రభాకర్ రెడ్డి ఎగరవేశారు. మహాసభల అధ్యక్షవర్గం గాద ప్రభాక ర్రెడ్డి, టీఉప్పలయ్య ఆధ్వ ర్యంలోఏర్పాటు చేసిన మ హాసభలో భాస్కర్పాల్గొని మాట్లాడారు. గత కాంగ్రె స్ ప్రభుత్వం విధాన పర మైన నిర్ణయా లు తీసుకో వడంలో, దేశ అభివృద్ధిని ముందుకు తీసుకు పోవడంలో విఫల మైందని అన్నా రు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభు త్వ రంగ సంస్థలన్నింటిని ఆదానీ అంబా నీలకు కట్టబెడుతూ ప్రభుత్వ భూములను కారు చౌకగా అ మ్ముతున్నారని విమర్శించారు. కార్మిక చట్టా లను నా లుగు కోడులుగా మార్చి పెట్టుబడుదా రులకు కంపె నీ యజమానులకు కార్మికులను కట్టు బానిసలాగా మారుస్తున్నారన్నారు. రైతాంగానికి నష్టంచేసే మూ డు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి పోరాటాల ఫలి తంగానే వెనక్కి తీసుకున్నారని తెలిపారు. విభజన హామీలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేస్తే ఆరులక్షల మందికి ఉపాధి దొరుకు తుందని పేర్కొన్నారు. బీజేపీకి ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని విమర్శించారు. మోడీ విధానాలను విమర్శిం చిన వారిపై దాడులు అక్రమ కేసులు బనాయిస్తున్నా రని వాపోయారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్ర భుత్వాలను అస్థిరపరచడం కోసం ఎమ్మెల్యేలను కొను గోలు చేయడం గానీ, ఈడీ, సీబీఐని పంపి ప్రభుత్వా లను కూలుస్తున్నారనిమండిపడ్డారు. ధరలను విపరీ తంగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు కనీసవేతనం రూ.26వేలు ఇవ్వాల ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేటికి అమలు చేయట్లేదని విమర్శించారు.శనివారం మోడీ పర్యట న నిరసిస్తూ మోడీ గోబ్యాక్ అని నిరసనలకు పిలిపి స్తే రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ నాయకుల ఇండ్లకు వెళ్లి రాత్రి నుండి అక్రమ అరెస్టులు చేస్తున్నారని వా పోయారు. ఈ చర్యలను ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శిరాగుల రమేష్, సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి, బొట్ల చక్రపాణి, కోశాధికారి ఐలయ్య, శ్రామిక మహిళా జి ల్లా కన్వీనర్ రజిత, ప్రతినిధులు పాల్గొన్నారు.