Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
రేగొండ మండలంలోని తిరుమల గిరి శివారు ప్రాంతమైన బుగులోని గుట్టల్లో కొలువైన శ్రీ వెంకటే శ్వర స్వామి వారి జాతర బ్రహ్మౌత్సవాలు నేటితో ముగిసినట్లు ఆలయ చైర్మన్ కడారి జనార్ధన్, ఈవో బిల్లా శ్రీనివాస్, తిరుమలగిరి సర్పంచ్ కట్ల రాణి లు తెలిపారు. ఈ నెల ఏడవ తేదీ నుండి ఐదు రోజుల పాటు బుగులోని గుట్టలో, అత్యంత వైభవంగా జరిగి న జాతర శనివారం స్వామి వారిని గుట్ట పైనుండి క్రిందికి దింపి, స్వామివారి ప్రత్యేక రథంలో మేళ తా ళాల మధ్య డప్పుచప్పులతో ఊరేగింపుగా గుట్ట పైనుంచి పూజారి వెంకటేశ్వర్లు ఇంటికి చేర్చడంతో జాతర ముగిసినట్లు ఆలయ ప్రధాన పూజారి కూర్మా చలం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈసారిజాతరకు చు ట్టూ ప్రక్కల ప్రాంతాల నుండి కాకుండ ఉమ్మడి వరం గల్ జిల్లా, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారని గత రెండు ఏళ్లుగా కరోన కారణంగా భక్తులు రాలేక పోయారని ఈ ఏడాది అ ధిక సంఖ్యలో వచ్చారని దాదాపుగా ఐదు లక్షల మం ది భక్తులు స్వామివారి దర్శనాన్ని చేసుకున్నట్లు ఆల య అధికారులు తెలిపారు. ఐదు రోజుల జాతర వి జయవంతం చేసేందుకు సహకరించిన ఆయా శాఖ ల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ఆలయ కమి టీ కృతజ్ఞతలు తెలియజేశారు. జాత రలో వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ సహకరించడం వల్ల విజయ వంతం చేశామని ఆలయ అధికారు లు తెలిపారు.
భక్తులకు కొండ మీద కు వెళ్లిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుం డా అన్నిచర్యలు తీసుకున్నామని అ న్నారు.ఈకార్యక్రమంలో ఇఓ బిల్లా శ్రీనివాస్, ఛైర్మెన్ కడారి జనార్దన్, సర్పంచ్ కట్ల రాణి మధుసూదన్ రె డ్డి, ఆలయ డైరెక్టర్లు అమ్ముల సదయ్య, బక్కతాట్ల ఓ దాకర్, గడ్డం రజిత, కొప్పుల రాములు ,పూజారి రవి, రావుల శ్రీధర్,అర్చకులు కూర్మచాలం వెంకన్న గ్రామ స్తులు చల్లగురుగుల సుదర్శన్, పల్నాటి శ్రీనివాస్, శ్రీధర్, తిరుపతి , తదితరులు ఉన్నారు.