Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
తెలంగాణ రాష్ట్రంవస్తే తెలంగాణ విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వ్యవసాయం, నిరుద్యోగులకు ఉ ద్యోగాలు, సామాజిక న్యాయం జరుగుతుందని ఆశిం చి 60 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ దోపిడి శక్తులవశమై సహజ వనరులన్నీ దోపిడీకి గురి అయ్యాయని తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా కన్వీనర్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయ ణ అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో ఉద్య మకారుల ఐక్యవేదిక సమావేశం ప్రజా సంఘాల జేఏ సీ అధ్యక్షులు ముంజల బిక్షపతి గౌడ్ అధ్యక్షతన నిర్వ హించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై న కూరపాటి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ స ర్వస్వం బొందలగడ్డగా మారిపోతున్న పరిస్థితులు దాపురించాయని, రాష్ట్రంలో పేద ప్రజలకు ఆధారమై న విద్యారంగం నిధులు లేక, నియామకాలు లేక ని యంత్రణ లేక ఆదరణ లేక సర్వనాశనం అవుతున్నద న్నారు. నాయకులకుప్రైవేటు యూనివర్సిటలు దారా దత్తం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పేద వర్గాలు విద్యకు ఉద్యోగాల కు ఉపాధికి దూరమైపోతున్నారని, అ భివృద్ధి కేవలము హైదరాబాదు సిరిసి ల్ల, సిద్దిపేట, గజ్వేలు, ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాలకే పరిమిత మైందన్నారు. ములుగు లాంటి వెను కబడిన ప్రాంతాలన్నీ దొరల పాలన లో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయని, ములుగు జిల్లా గిరిజన విశ్వవిద్యాల యం 8 సంవత్సరాలు గడిచిన ప్రారంభించకపో వడం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల వైఫల్యమే కారణం మన్నారు. కేంద్రంలోని ప్రభుత్వంతో అలైబలై తీసు కొని ఏడేళ్లు స్నేహ పూర్వక సంబంధాలు కొనసా గించి అనేక బిల్లులను ఆమోదించే చట్టాలు తేవడం లో టిఆర్ఎస్ ఎంపీలు పూర్తిగా సహకరించినారని వి భజన చట్టంలోని అనేక అంశాలు సాధించలేకపోవ డం రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యమే ఆదివాసీ ప్రాంతాల పట్ల వివక్షతే కారణం అవుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్రం ఆరోప ిస్తుందని, భూమి ఇచ్చినా గాని కేంద్రం జాప్యం చేస్తు న్నదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని ఈ విష యంలో ప్రజలను మభ్యపెట్టి అసలు విషయాలు తే ల్చకుండాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడడం వల్ల వెనుకబడిన ప్రాంతమైన ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఈ నాటికి కూడా ప్రారం భించకపోవడం దురదష్టకరమన్నారు.
ప్రజలకు స్పష్టత ఇవ్వడానికై టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే గిరిజన యూనివర్సిటీ విషయం లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరా లతో పాటు అన్ని విషయాలు తెలియజేస్తూ ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకా రుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా డిమాండ్ చేస్తున్న దన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు ఒక రాజకీయ క్రీడ పద్ధతిలో యూనివర్సిటీ స్థాపనను జాప్యం చేయడం వల్ల ములుగు జిల్లా అభి వృద్ధి గిరిజన ఆదివాసివర్గాల ఆకాంక్షలకు భంగం క లుగుతున్నదని, కవలం కొత్త జిల్లాల ఏర్పాటు చేసి చేతులెత్తేస్తే అభివృద్ధి జరగదు వెనుకబడిన ప్రాం తాల జిల్లాలను ఒక ప్రణాళికాబద్ధంగా అభివద్ధి చేయ కుండా నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్ష ణం కాదన్నారు. ఈ సంవత్సరం 2023 24 లో ము లుగు పట్టణంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని సంపూ ర్ణ అంగులతో ప్రారంభించి సాంప్రదాయ కోర్సులతో పాటు ఆధునిక కోర్సులను కూడా ప్రారంభించి వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతమైన జిల్లా అభివద్ధికి తోడ్ప డాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేదిక కోరుతున్న దని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ సీనియర్ నాయకులు, నెమలి నర్సయ్యమాదిగ, వి హెచ్పీఎస్ జిల్లా కన్వీనర్ మంచోజు చంద్రమౌళి, మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంపీఎస్) ములుగు టౌన్ అధ్యక్షులు మరాఠీ రవీందర్,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొచ్చు సాంబయ్య ప్రజాసంఘాల నాయకులు నిమ్మల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.