Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీ సులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం భూపాలపల్లి పోలీస్ స్టేష న్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ రాజిరెడ్డి వెల్లడించా రు. భద్రాద్రి కొత గూడెం జిల్లా రామవరం గ్రామానికి చెందిన పోతరాజు వెంకటేష్ (33) అనే వ్యక్తి గత సంవత్సరం కిందట తన తండ్రి మల్లేష్ వారసత్వ ఉద్యోగాన్ని పొంది భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్ కాలనీలో నివాసం ఉంటూ సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరో వైపు కొత్తగూడెం భద్రాచలం అటవీ ప్రాంతాల్లో ఎండు గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి.. భూ పాలపల్లికి తీసుకవస్తున్నాడు. ఇదే క్రమంలో శనివారం పట్టణంలోని 6ఇంకైన్ సమీపంలోని సింగరేణి స్కూలు వద్ద గంజాయి విక్రయించేం దుకు సిద్ధంగా ఉన్నాడు. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. అనుమానస్పందంగా వెంకటేష్ కనిపిం చడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా 500 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. అతనిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. గంజాయి సేవించడం. విక్రయాలు జరపడం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని, అలాంటి వారి ఎరైనా కంట పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ రాజారెడ్డి కోరారు. ఈసమావేశంలో ఎస్సై స్వప్న కుమారి, హెడ్ కానిస్టేబుళ్లు మల్లయ్య, రమణయ్య, కానిస్టేబును వెంకటరెడ్డి, సురేష్, రాజారాం నాయక్ లు పాల్గొన్నారు.