Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ఫొటో గ్రాఫర్ల నైపుణ్యా న్ని పెంచడం కోసమే ఫొటో ఎగ్జిబిషన్లు ఎంతగానో దో హదపడుతాయని ఫోటో గ్రా ఫర్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అన్నారు. శనివారం మండల కేంద్ర మైన తాడిచెర్లలో నాగులాం బిక ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈనెల 18,19,20 తేదిలలో కేబిఆర్ కన్వెన్షన్ హాల్, ఎల్బీనగర్ హైదరాబాదులో జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు ఎండి రఫీతో కలిసి హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 18, 19 ,20 తేదీలలో హైదరాబాద్ కన్వె న్షన్ హాల్ జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు అందరూ హాజరై విజయవంతం చేయాల న్నారు. ఫోటోగ్రాఫర్లు నైపుణ్యాన్ని పెంచడం కోసం ఫోటో ఎక్స్పోలు అవసరమని అన్నారు. ఎక్స్పోలో నూతన టెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్ర మంలో సీనియర్ ఫోటో గ్రాఫర్స్ పాలిశెట్టి నరేష్, జక్కుల రమేష్, అజ్మీరా శ్రీని వాస్, నగేష్,సతీష్,నవీన్, నాగరాజు, శేఖర్, కోటీష్,సది తదితరులు పాల్గొన్నారు.