Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శనివారం మహారాష్ట్ర ముంబై కి చెందిన పురావస్తు శాఖ పరిశోధక బృందం సంద ర్శించారు. మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను ఫోటోలు వీడియోలు చిత్రీకరించుకున్నారు. ఈ సందర్భం గా బృందం సభ్యులు మాట్లాడుతూ కోటగుళ్ల శిల్ప సంపద ఎంతో అద్భుతమని రామప్పను పోలిన విధంగా ఉన్న ఈ ఆలయ శిల్ప సంపదను భావి త రాలకు అందించాలని అన్నారు. శిధిలమైన ఆలయాలను తిరిగి పునర్నిర్మించి కోటగుళ్ళకు పూర్వ వైభవం తేవాలన్నారు. గత మూడు సంవత్సరాలుగా తమ బృందం కోటగుళ్లను సందర్శించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారన్నారు.