Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చే యడంలో ప్రధానమంత్రి మోడీకి వివక్ష తగదని కాం గ్రెస్ పార్టీ జాతీయనేత, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీ తక్క అన్నారు. ములుగు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య క్షులు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్‌యూఐ ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పో రుబాట కార్యక్రమం ముఖ్య అతిథులుగాకాంగ్రెస్ పా ర్టీ జాతీయనేత, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క హాజరై మా ట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల డ్రామాలు ఆపా లని, ఎనిమిదేళ్లు గడచినప్పటికీ విశ్వవిద్యాల యం మందుకెళ్లకపోవడంతో గిరిజన విద్యార్థులకు అన్యా యం జరుగుతుందని అన్నారు. విశ్వవిద్యాల యం పూర్తి అయితే ఇప్పటికే పర్యా టక రంగంలో ముందున్న ములుగు ఎడ్యుకేషన్ హబ్ ?గా మారుతుందని 2014 రాష్ట్ర విభజన చట్టంలో హా మీ ఇచ్చిన గిరిజన విశ్వవిద్యా లయం కేటాయించి నప్పటికీ తరగతులు ప్రారంభించలేదు అని గతనెలలో నేను గిరిజన యూ నివర్సిటీ తరగతులు ప్రారంభించండి అని స్వయం గా రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సైని కలిసి లేఖ అందించ డంజరిగిందన్నారు. సంబంధిత కేంద్ర,రాష్ట్ర మంత్రు లకు లేఖలు అందించడం జరిగిందని,గిరిజన యూ నివర్సిటీకి స్థలం కేటాయించినప్పటికీ పనులు ఎందు కు చేపట్టడం లేదని గిరిజన యూనివర్సిటీ ద్వారానే ములుగు అభివృద్ధి సాధ్యమని గిరిజన యూనివర్సి టీ తరగతులు ప్రారంభించేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఏపీలో ఇప్పటికే ప్రారం భం అయిపోయిందనీ, గిరిజన యూనివర్సిటీ కి అవ సరమైన భవనాలు,మౌలికసదుపాయాల ఏర్పా టుకు కేంద్ర ప్రభుత్వం 800 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేసి 6 ఏళ్లు అవుతున్నా పనులు జరగలేదని గిరిజన విశ్వవిద్యాల యం కోసం ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రేమ్‌నగర్ లో ప్రతిపాదిత స్థల సేకరణ పూర్తైందన్నారు.
మొత్తం 337 ఎకరాల భూమిని గిరిజన సంక్షేమ శాఖకు ఏ డాది కిందట అప్పగించారన్నారు. రెవెన్యూ శాఖకు చెందిన 285 ఎకరాలు కేటాయించి నప్పటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు దొంగ నాటకాలతో పబ్బం గడుపుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మ న్ మల్లాడి రాంరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొ ల్లపెల్లి రాజేందర్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ముంజాల భిక్షపతిగౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్య క్షులు బానోత్రవి చందర్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షు లు కంబాల రవి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి బాగ్వాన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్య నారాయణ, చిటమట రఘు, ఎండీఅఫ్సర్, జెడ్పీటీసీ నామా కరంచంద్‌గాంధీ, వ ర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, బండిశ్రీనివాస్, రసుపుత్ సీతారాంనాయక్, ఎన్ ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి, జాతీ య కో-ఆర్డినేటర్ అభినరు గౌడ్, జిల్లా, మండల అ నుబంధ సంఘాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీ లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సంఘం చై ర్మన్, మాజీ మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.