Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉధంతం
నవతెలంగాణ-మల్హర్రావు
ఖరీప్ సీజన్ లో పలురువు రైతులు ఎంటియు 1001 దోడ్డురకం వరి నకిలీ విత్తనాలు సాగుచేసి తీవ్రంగా నష్టపోయిన సంఘటన మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత రైతులు ఆర్ని రాజబాబు,ఆర్ని ప్రసాద్,ఆర్ని రజిత తోపాటు పలువురు రైతుల పూర్తి కథనం ప్రకారం.తాడిచెర్లలోని తిరుమల ట్రేడర్స్ పేర్టిలైజర్ పెస్టి సీడ్స్ ప్రయివేటు దుకాణంలో వినాయక సీడ్స్ (దొడ్డు రకం) కొనుగోలు చేసి తీసుకొచ్చారు.అయితే ఈ వరి విత్తనాలను రైతులు ఖరీప్ సీజన్లో పొలాల్లో వేదజల్లె పద్దతి ద్వారా సుమారుగా 30 ఎకరాల్లో విత్తనాలు నాటారు. పంటకాలం ముగిసేనాటికి కూడా పొలాలు ఈనకుండా,కంకులు రాకపోవడమే కాక ఎక్కువగా కళ్తులు ఉండటంతో ఎరువుల వ్యాపారి ఇచ్చిన వరి విత్తనాలు నకిలివని బహిర్గతమైయిందన్నారు.ముందుగా వ్యాపారిని నిలదీసేందుకు ప్రయత్నం చేశారు.వ్యాపారి పట్టించుకోకపోవడంతో సంబంధించిన మండల వ్యవసాయ అధికారుల దష్టికి తీసుకపోయినట్లుగా తెలిసింది.వ్యాపారి ఇచ్చిన నకిలీ విత్తనాలతో ఎకరాకు రూ.30 వేల వరకు నష్టపోయామని రైతులు ఆరోపిస్తున్నారు. నకిలీ విత్తనాలు వేసి నష్టపోయిన బాధిత రైతులను ఆర్ధికంగా అదుకొని, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.