Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు తెచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిం దని ధాన్యం కొనుగోల్ని రైతులు సద్వినియోగం చేసు కోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని పాంనూర్, స్టేషన్ ఘనపూర్ గ్రామాల్లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొ నుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచులు కోతి రేణుకా రాములు, తాటికొండ సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల పక్షాన సీఎం కేసీఆర్ నిలిచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్నరని వివరిం చారు. ఈ వానాకాలం వరిధాన్యం కొనుగోలుకు ఏ గ్రేడ్‌కు రూ.2060, బీ గ్రేడ్‌కు రూ.2040 అందిస్తుం దన్నారు. గతంలో రైతులు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం యాంత్రీకరణ పద్ధతిలో తొందరగా ధాన్యం విక్రయిస్తున్నారన్నారు. మధ్య దళారులను ఆశ్రయిం చక, నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మరోమారు రైతులపై కక్షతో మోడీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిం చాలని చూస్తున్నారని అన్నారు. రైతులకు రాష్ట్రంలో ఉచితాలు ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర పథకాలన్ని దేశమంతటా అమలు కావాలంటే కేసీఅర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఎంపీటీసీ ఇనుగాల రజిత - రాజిరెడ్డి, మునిగేల రాజు, ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, డైరెక్టర్లు చిగురు సరితాంజనేయులు, రాజ్‌కుమార్, ఎపీఎం కవిత, గ్రామ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కార్యదర్శి కలకోల నరేందర్, రైతు కో ఆర్డినేటర్ సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతు ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం
జఫర్గడ్ : రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మండలంలోని తీగారం, కూనూర్, రఘునాథ్ పల్లి గ్రామాలలో ఎంపీపీ రాడపాక సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీని వాస్, మార్కెట్ చైర్మన్ గుజ్జారి రాజుతో కలిసి ప్రారం భించారు. వైస్ ఎంపీపీ కొడారికనకయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, సర్పంచ్ ఇల్లందుల కుమార్, మహిళా అధ్యక్షురాలు గోలి కవిత, మండల కార్యదర్శి భాగ్యమ్మ, ఏపీఎం సురేందర్, సీసీ నరసింగం, సహదేవ్, సర్పంచ్ శ్రీదేవి పెద్దిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రాజ్ కుమార్ , మీడియా ఇన్చార్జి రెడ్ల రాజు,తదితరులు పాల్గొన్నారు.
దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొడకండ్ల : రైతు సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పండిన ప్రతి వరి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఉమ్మడి వరంగల్ డీసీఐసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి అన్నారు. శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో రైతు సంక్షేమం కోసం ఉచిత కరెంట్ రైతు బీమా రైతు ఇన్సూరెన్స్ కల్పించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి నిరుపేదల ఇండ్లలో వెలుగులు నింపిందన్నారు. ఎంపీపీ జ్యోతి మార్కెట్ చైర్మన్ రాము, రైతు సమన్వయ సమితి సభ్యుడు వెంకటేశ్వరరావు, సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీలు యాకయ్య, విజయలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
పాలకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని శాతాపురంలో తొర్రూరు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ వైస్ చైర్మన్ బానోతు రాంధన్ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులు 17 తేమశాతం ఉండేలా చూసుకోవాలన్నారు. కల్లాల వద్దే ధాన్యాన్ని తూర్పారబట్టి తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. సొసైటీ సీఈవో మాసంపెళ్లి రణధీర్, టీఆర్ఎస్ గ్రామ అధ్య క్షుడు తోడేటి ఎల్లయ్య, సొసైటీ సిబ్బంది రాజకుమార్, రైతులు కష్ణమూర్తి, యాదగిరి, రవి, కిష్టయ్య, నరసయ్య, నరసింహ, సమ్మయ్య, పాల్గొన్నారు.