Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్ బెల్ట్
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి ఆదివారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ శనివా రం మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభో త్సవం సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ పై సిం గరేణి ప్రైవేటీకరణ అనే ప్రసక్తే లేదని కేంద్ర వైఖరిని స్పష్టం చేయడంపట్ల హర్షంవ్యక్తం చేస్తూ మోడీ చిత్ర పటానికి పాలభిషేకంచేయడం జరిగిందన్నారు. సిం గరేణిలో 51 శాతం రాష్ట్ర వాటా, 49 శాతం కేం ద్రం ఉన్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చే స్తుందనడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు బి జెపిపై బురదజల్లే ప్రయత్నం తప్ప మరొకటి లేదని మోడీ స్పష్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి, మిగతా యూనియన్లకు చెంప పెట్టని గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం 6300 కోట్ల రూపాయలతో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరిం చడం, రైతులకు అతి తక్కువ ధరకే ఎరు వులు అందించడం, మూడు జాతీయ రహదారుల విస్తరణ, సింగరేణి బొగ్గు రవాణా కోసం భద్రాచలం నుండి సత్తుపల్లి రైల్వే లైన్ ప్రారంభించడం తదితర పనులు చేస్తుంటే అభివద్ధిని ఓర్వలేక కెసిఆర్ ప్రభు త్వం,ఎర్రజెండా పార్టీలు బట్ట కాల్చి మీదేస్తున్నాయని మండిపడ్డారు.సింగరేణి ప్రైవేటీకరణ అంటూ కెసిఆ ర్ ప్రభుత్వం కార్మికులకు వక్ర భాష్యం చెప్తూ మోసం చేయడం పట్ల మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు సింగరేణి పట్ల తనకున్న వైఖరిని చెప్పకనే చెప్పిందని వివరించారు. బొగ్గు గనులను పారదర్శకంగా వేలం వేయడం, బొగ్గు ఉత్పత్తి ఏరియాలలో ఆ ప్రాంత అభి వృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ను అక్కడే ఖర్చు చేసి ఆ ప్రాంత అభివద్ధికి దోహదపడతామని తెలప డంపట్ల బిఎంఎస్ పక్షాన ప్రధానికి కతజ్ఞతలు తెలి పారు. సింగరేణి కార్మికులు ఈ విషయాన్ని గమనం లోకి తీసుకోని బిఎంఎస్ను ఆదరించి రానున్న ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో గెలిపించి సింగరేణి అభివృద్ధికి సహకరించాలని అప్పాని కోరారు. ఈ కార్యక్ర మంలో నాయకులు సుజేందర్, శంకర్, బోయిన వెం కటస్వామి, దామోదర్, జనార్దన్, భాస్కర్, మల్లేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.