Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రకార్యదర్శి వంగేటి అశోక్ కుమార్
- జిల్లా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
నవతెలంగాణ-మంగపేట
సంఘం అభివృద్ధికి ప్రతి ఆర్యవైశ్యుడు ఆర్ధికంగా ఆదుకోవాలని ఆర్యవైశ్య మ హాసభ రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మండ లంలోని శ్రీహేమాచల లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభ వంగా జరిగిన ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా నూతన కార్యవర్గ ప్రమా ణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు జిల్లా ఆ ర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హేమాచలంలోని శ్రీరమాసత్యనారాయణస్వామి ఆ లయంలో ఆర్యవైశులు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొని కార్తీ క మాస పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన నూతన జిల్లా కమిటీ ప్రమా ణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగింది. ఈ సందర్బంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యమహాసభ ఆధ్వర్యంలో సంఘం భలోపేతంగా ఉందని ఉమ్మడి జయశంకర్ భూలపల్లి జిల్లా నుండి ములుగు జిల్లాగా ఏర్పడ డంతో ఇక్కడ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
జిల్లా నూతన అద్యక్షుడుగా మండలంలోపి కమలాపురంకు చెందిన శిద్దంశెట్టి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రసిడెంట్ గా శిద్దంశెట్టి లక్ష్మణ్ రావు, ప్రధానకార్యదర్శిగా కొమురవెల్లి నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగావేల్పూరి శ్రీనివాసరావులతో పాటు కోశా ధి కారి కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆర్యవైశ్య కుటుంబాలు సామూహిక కార్తీకమాస భోజనాలు చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా చిరుప అనిల్ కుమార్, జయశంకర్ భూపాలపల్లి వాసవీక్లబ్ వైస్ ప్రెసిడెంట్ పవిత్ర శ్రీనివాసరావు, సిద్దంశెట్టి వైకుం ఠం, సొసైటీ చైర్మన్ తోట రమేష్, మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అద్యక్షుడు మైల జయరాంరెడ్డి, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షుడు గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆక రాధాకష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త నల్లూరి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘంనాయకులు పడమటింటి సత్యనారాయణ, శిద్దంశెట్టి కనకారా వు తదితరులు పాల్గొన్నారు.