Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ భూపాలపల్లి ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-చిట్యాల
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎన్టిపిసిని 2004లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిం చిందని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గం డ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండ ల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుం డం ఎన్టిపిసి ఎరువుల ఫ్యా క్టరీని జాతికి అంకితం చే స్తానని దేశ ప్రధాని నరేం ద్ర మోడీ చెప్పడం సిగ్గు చేటుగా ఉందని ఎద్దేవా చే శారు. రైతులపై ప్రేమ ఉంటే దేశ ప్రధాని కాంగ్రె స్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సబ్సిడీలను ముఖ్యంగా రైతులకు సంబంధిం చిన వెలుగుల సబ్సిడీని ఎత్తివేసి నేడు దేశంలో ని యంతపాలన కొనసాగిస్తూ సామాన్యునికి అందుబా టులో లేని విధంగా ధరలు పెంచి రైతాంగాన్ని కార్మిక వర్షాక వర్గాలను శ్రమ దోపిడీ చేస్తూ ఆదాని అంబానీ సంస్థలకు దోచిపెడుతుంది బిజెపి ప్రభుత్వం అని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ రంగసంస్థల్ని అమ్ము తూ ప్రజలపై పెనుబారం మోపుతూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్న నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతాంగానికి నిరుపేద ప్రజలకు అన్ని రంగాల కార్మి కులకు నిత్యవసర సరుకులు అందుబాటులో ఉన్నా యని నేటి బిజెపి ప్రభుత్వం హాయంలో కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు కొట్టుమిట్టాడుతున్నాయని అన్నా రు. బిజెపి మాయ మాటల్ని దేశ ప్రజలు నమ్మరని ఆ యన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ మం డల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, నాయకులు గ డ్డం కొమురయ్య దొడ్డి కిష్టయ్య, చిలుకలరాయ కుమురు, గుమ్మడి సత్యం తదితరులు పాల్గొన్నారు.